• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PRASHANT KISHORE MEETING WITH SOME OF YSRCP LEADERS CREATE TENSION IN PARTY AK

వైసీపీ నేతలకు పీకే నుంచి పిలుపు... అందరిలోనూ టెన్షన్ టెన్షన్

వైసీపీ నేతలకు పీకే నుంచి పిలుపు... అందరిలోనూ టెన్షన్ టెన్షన్

ప్రశాంత్ కిశోర్ (ఫైల్ ఫొటో)

ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి వైసీపీ అభ్యర్థుల బలాబలాలపై నివేదిక రూపొందించిన పీకే టీమ్... వాటిని వైసీపీ అధినేత జగన్‌కు అందజేసింది. వాటి ఆధారంగానే వైసీపీ నేతలతో ప్రశాంత్ కిశోర్ సమావేశమవుతున్నారని తెలుస్తోంది.

  • Share this:
    ఎన్నిక‌లు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ స్పీడు పెంచుతోంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రస్తుతం జేడీయూ నాయకుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి వైసీపీ అభ్యర్థుల బలాబలాలపై నివేదిక రూపొందించిన పీకే టీమ్... వాటిని వైసీపీ అధినేత జగన్‌కు అందజేసింది. వాటి ఆధారంగానే ఆయన హైదరాబాద్‌లోని తన సంస్థ కార్యాలయంలో వైసీపీ నేతలతో సమావేశమవుతున్నారని తెలుస్తోంది.

    తన టీమ్ సర్వేలో నెగిటివ్ రిపోర్టు ఇచ్చిన ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతలు, ఆశావాహులను పిలిపించి మాట్లాడేందుకే ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ముగ్గురు ఎమ్మెల్యేల‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ అయినట్టు సమాచారం. వీరితో పాటు ఈ సారి టిక్కెట్ కోసం ఆశావాహులుగా ఉన్న నేత‌ల‌తో కూడా పీకే వ్యక్తిగత భేటీలు ఏర్పాటు చేసుకుంటున్నారని టాక్. తాజాగా మ‌చిలీప‌ట్నం టికెట్ ఆశిస్తున్న పేర్ని నానికి పీకే నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై చర్చించినట్టు ప్రచారం సాగుతోంది.

    వైసీపీ ముఖ్యనేత అయిన అంబాటి రాంబాబుకు పీకే నుంచి పిలుపువచ్చినట్టు సమాచారం. ఈసారి అంబటికి టికెట్ కేటాయించడం కష్టమే అని పార్టీలోచర్చ జరుగుతున్న నేపథ్యంలో... ప్రశాంత్ కిశోర్ నుంచి అంబటి రాంబాబుకు పిలుపు వచ్చిందనే ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సత్తెనపల్లి టికెట్ అంశానికి సంబంధించి పీకే అంబటితో మాట్లాడినట్టు తెలుస్తోంది. అంబ‌టిపై ఇప్పటికే స్థానికంగా కేడ‌ర్ నుంచి చాలా ఫిర్యాదుల వ‌చ్చిన నేప‌థ్యంలో... ఇప్పుడు పీకే అంబ‌టితో ఏం చ‌ర్చించారు అనేది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రోకవైపు ఈ సారి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని రెడ్డి సామాజీక‌వ‌ర్గానికి ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    వీరితో పాటు మరో వైసీపీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన శీనుకు కూడా పీకే నుంచి పిలుపు వచ్చినట్టు వార్తలు జోరందుకున్నాయి. ఈ సారి వైసీపీ నుంచి రెండు అసెంబ్లీ టికెట్లతో పాటు ఒక ఎంపీ సీటును బొత్స ఆశిస్తున్నారు. తనతో పాటు తన మేనల్లుడు చిన శీనుకు ఎమ్మెల్యే టికెట్లు, తన భార్య ఝాన్సీకి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పీకే నుంచి చిన శీనుకు కబురు అందినట్టు సమాచారం. అయితే చిన శీను టికెట్‌కు సంబంధించి జ‌గ‌న్ ఇప్పటివరకు బొత్సకు ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ నుంచి ఇంకెంతమంది వైసీపీ నేతలకు పిలుపు అందుతుంది... ఆయన వారితో ఏం చెబుతారు అనేది ఆసక్తి రేపుతోంది.




    First published: