Home /News /politics /

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం..ఆ పదవికి గుడ్‌బై.. నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం..ఆ పదవికి గుడ్‌బై.. నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ గత నెలలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. జులై 13న రాహుల్‌ నివాసంలో సమావేశమై దాదాపు మూడు గంటలకుపైగా సుదీర్ఘ చర్చలు జరిపారు.

    ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు. ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ తెలిపారు.

    ‘‘ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొద్ది రోజులు తాత్కాలిక విరామం తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నట్లు మీకు ఇది వరకే తెలుసు. ఈ క్రమంలలోనే ప్రధాన సలహాదారు బాధ్యతలను నేను నిర్వర్తించలేకపోతున్నా. నా భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ప్రధాన సలహాదారు బాధ్యతల నుంచి నన్ను రిలీవ్‌ చేయాలని కోరుతున్నా. మీ సలహాదారుగా నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలలు’’ అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో దీదీ ఓడిపోయినప్పటికీ టీఎంసీ మాత్రం భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. రాజకీయ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆ రోజే ఆయన వెల్లడించారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణను ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

    ఈ ఏడాది మార్చిలో ప్రశాంత్ కిశోర్ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు పంజాబ్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. 2022 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్‌ను సలహాదారుగా నియమించుకున్నట్లు గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు 2017 ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ విజయం కోసం అమరీందర్ సింగ్, ప్రశాంత్ కిశోర్ కలిసి పనిచేశారు.ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ భేదాభిప్రాయ సమస్య పరిష్కారంలోనూ పీకే కీలక పాత్ర పోషించారు. కానీ ఎన్నికలు కొన్ని నెలల ముందే పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.

    కాగా, ప్రశాంత్ కిశోర్ గత నెలలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. జులై 13న రాహుల్‌ నివాసంలో సమావేశమై దాదాపు మూడు గంటలకుపైగా సుదీర్ఘ చర్చలు జరిపారు. పంజాబ్‌లలో నెలకొన్న సంక్షోభం గురించే చర్చ జరిగిందని మొదట భావించారు. కానీ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరే అంశంపై మంతనాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. పీకే గురించి పార్టీ పెద్దలతోనూ రాహుల్ గాంధీ చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ర చేరిక దాదాపు ఖాయమైందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన పంజాబ్ సీఎం సలహాదారుడు పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ కొన్నేళ్ల క్రితం జేడీయూ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కొన్ని నెలలకే నితీష్ కుమార్‌తో విభేదాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

    ఇవి కూడా చదవండి:

    World’s Highest Road: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మనదేశంలోనే.. ఎక్కడో తెలుసా?

    Ayodhya: భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం ఎప్పటి నుంచి అంటే..! నిర్మాణం మొదలై నేటికి ఏడాది..
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Prashant kishor, Punjab

    తదుపరి వార్తలు