ప్రశాంత్ కిశోర్ మా ఇంటికి ఐదుసార్లు వచ్చాడు.. నేనే గెంటేశా.. : రబ్రీ దేవి

ప్రశాంత్ కిశోర్ తమ ఇంటికొచ్చిన విషయం సెక్యూరిటీ గార్డ్స్‌కి కూడా తెలుసని.. పాల్తు రామ్(నితీశ్ కుమార్) గతంలోనూ ఇలాగే తన స్టాండ్ మార్చుకున్నాడని రబ్రీ దేవి ఆరోపించారు.

news18-telugu
Updated: April 12, 2019, 3:14 PM IST
ప్రశాంత్ కిశోర్ మా ఇంటికి ఐదుసార్లు వచ్చాడు.. నేనే గెంటేశా.. : రబ్రీ దేవి
లాలూతో కలిసి పూజా కార్యక్రమంలో రబ్రీ దేవి (File)
  • Share this:
మొదటి విడత లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసిన నితీశ్ కుమార్.. ఆ తర్వాత మళ్లీ తమతో కలవడానికి ప్రశాంత్ కిశోర్ ద్వారా రాయబారం నెరిపారని ఆరోపించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ప్రశాంత్ కిశోర్‌ను ఐదుసార్లు తమ ఇంటికి పంపించినట్టుగా చెప్పారు. అయినప్పటికీ తాము ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపులకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇటీవల లాలూ ప్రసాద్.. తన జీవిత చరిత్ర'గోపాల్‌గంజ్ టూ రైసినా' పుస్తకంలోనూ ప్రశాంత్ కిశోర్ గురించి ఈ విషయాన్ని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ప్రశాంత్ కిశోర్ మా ఇంటికి ఐదుసార్లు వచ్చాడు. నేనే ఇంటి నుంచి గెంటేశా. ఆర్జేడీ, జేడీయూలను తిరిగి కలిపేందుకు నితీశ్ తనను పంపించాడని లాలూతో ప్రశాంత్ కిశోర్ చెప్పాడు. కానీ దాన్ని మేము వ్యతిరేకించాం. నితీశ్‌పై మాకు నమ్మకం లేదు.
రబ్రీ దేవి, మాజీ సీఎం


ప్రశాంత్ కిశోర్ తమ ఇంటికొచ్చిన విషయం సెక్యూరిటీ గార్డ్స్‌కి కూడా తెలుసని.. పాల్తు రామ్(నితీశ్ కుమార్) గతంలోనూ ఇలాగే తన స్టాండ్ మార్చుకున్నాడని రబ్రీ దేవి ఆరోపించారు. మరోవైపు ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్న సంగతి తెలిసిందే. లాలూ పుస్తకంలో పేర్కొన్న విషయాలు బోగస్ అని.. లాలూతో రాయబారానికి నితీశ్ ఎవరినీ పంపించలేదని తెలిపారు.
First published: April 12, 2019, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading