‘సీఎం మీరే.. ఆ ఒక్క పని చేయండి’ జగన్‌కు ప్రశాంత్ కిశోర్ సూచన

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో పనిచేస్తున్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ప్రశాంత్ కిశోర్‌ను, ఆయన టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

news18-telugu
Updated: April 12, 2019, 9:21 PM IST
‘సీఎం మీరే.. ఆ ఒక్క పని చేయండి’ జగన్‌కు ప్రశాంత్ కిశోర్ సూచన
ప్రశాంత్ కిశోర్, వైఎస్ జగన్
news18-telugu
Updated: April 12, 2019, 9:21 PM IST
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిశోర్ కీలక సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో జగన్ సారధ్యంలోని వైసీపీ గెలవడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రశాంత్ కిశోర్ సారధ్యంలో పనిచేస్తున్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ప్రశాంత్ కిశోర్‌ను, ఆయన టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం రెండేళ్లుగా వైసీపీకి సేవలు అందిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన జగన్ అక్కడున్న ఉద్యోగులను నవ్వుతూ పలకరించారు. అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్.. జగన్ మోహన్ రెడ్డికి ఓ సూచన చేశారు. ‘ఏపీలో మీరే సీఎం కాబోతున్నారు. మీరు సీఎం కావాలి. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలి’ అని పీకే సూచించారు.

First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...