సిటిజెన్‌షిప్ డీమోనిటైజేషన్ : ఎన్‌ఆర్‌సీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

ప్రశాంత్ కిశోర్ ఎన్‌ఆర్‌సీని డీమోనిటైజేషన్‌తో పోల్చారు.ఎన్‌ఆర్‌సీ 'సిటిజెన్‌షిప్ డీమోనిటైజేషన్' లాంటిదని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: December 15, 2019, 12:43 PM IST
సిటిజెన్‌షిప్ డీమోనిటైజేషన్ : ఎన్‌ఆర్‌సీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
ప్రశాంత్ కిశోర్ (File Photo)
  • Share this:
వివాదాస్పద పౌరసత్వ నమోదు చట్టాన్ని జేడీయూ ఉపాధ్యక్షుడు,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి దీనిపై స్పందించిన ఆయన.. ఎన్‌ఆర్‌సీని డీమోనిటైజేషన్‌తో పోల్చారు.ఎన్‌ఆర్‌సీ 'సిటిజెన్‌షిప్ డీమోనిటైజేషన్' లాంటిదని అభిప్రాయపడ్డారు. 'ఎన్‌ఆర్‌సీ అనేది సిటిజెన్‌షిప్ డీమోనిటైజేషన్ లాంటిది. నువ్వు ఈ దేశ పౌరుడివే అని నిరూపించుకునేంతవరకు నీ పౌరసత్వం చెల్లుబాటు కాదు.దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది పేద,మధ్యతరగతి వర్గాల ప్రజలే. గత అనుభవాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.' అంటూ ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ అనేది పెద్ద సమస్య కాదు.. కానీ ఎన్‌ఆర్‌సీతో దాన్ని జోడించడం అసలు సమస్య అంటూ అంతకుముందు నితీశ్ కుమార్‌తో భేటీ అనంతరం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

కాగా, పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రశాంత్ కిశోర్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు,బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆమోదించలేదు. శనివారం రాత్రి జరిగిన భేటీలో వీరిద్దరి మధ్య ఈ విషయాలన్నీ చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే ఆ చర్చల సారం ఏంటన్నది ఇంతవరకు బయటకు రాలేదు. ఏదేమైనా ఎన్‌ఆర్‌సీపై ఒకే పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.


Published by: Srinivas Mittapalli
First published: December 15, 2019, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading