ఇక ఆ పార్టీ కోసం వ్యూహాలు రచించనున్న ప్రశాంత్ కిశోర్..

రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-PAC) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయబోతున్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 11:25 AM IST
ఇక ఆ పార్టీ కోసం వ్యూహాలు రచించనున్న ప్రశాంత్ కిశోర్..
ప్రశాంత్ కిశోర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-PAC) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ చీఫ్,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వచ్చే ఏడాది జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలందించనున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అదే బీజేపీకి వ్యతిరేకంగా బీహార్‌లో జేడీయూ వ్యూహకర్తగా పనిచేశాడు.అనుకున్నట్టుగానే జేడీయూని అధికారంలోకి తీసుకొచ్చాడు. అటుపై పంజాబ్‌లో కాంగ్రెస్ తరుపున కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం పనిచేశాడు. అమరీందర్ సింగ్ సర్కార్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు. వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కేవలం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే విఫలమయ్యాడు. అక్కడ ఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. చివరకు అనుకున్నది సాధించలేకపోయారు. అయితే ప్రశాంత్ కిశోర్ సలహా వినకుండా ఎస్పీ కాంగ్రెస్‌తో చేతులు కలపడమే..వారి ఓటమికి కారణమన్న ప్రచారం ఉంది.

ఇక ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేసిన సంగతి తెలిసిందే.వైస్ జగన్ అధికారంలోకి రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఏదేమైనా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సక్సె‌ఫుల్ పర్సన్ అని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయన సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.


Published by: Srinivas Mittapalli
First published: December 14, 2019, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading