పీకే నెం.2 భ్రమలో ఉన్నారా...నితీష్ వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి?

పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని పరోక్షంగా వెల్లడించారు. దాంతో నితీష్‌పై పీకే అసంతప్తితో ఉన్నారని... జేడీయూలో కుమ్ములాటలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: April 1, 2019, 10:48 PM IST
పీకే నెం.2 భ్రమలో ఉన్నారా...నితీష్ వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి?
ప్రశాంత్ కిశోర్, నితీశ్ కుమార్
  • Share this:
జేడీయూలో ప్రశాంత్ కిశోర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ ప్రచార బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌పై బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే.. జేడీయూ ఉపాధ్యక్షుడు పదవిలోనే ఉన్నారని చెప్పారు. నెం.2, నెం.3 అనేది విశ్లేషణ బట్టి ఉంటుందని...ప్రశాంత్ కిశోర్ అలాంటి భ్రమల్లో ఉంటే తానేం చేయలేనని స్పష్టంచేశారు. న్యూస్ 18 ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రశాంత్ కిశోర్ మా పార్టీలోనే ఉన్నారు. జేడీయూ ప్రచారకర్తగా కూడా ఉన్నారు. మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయనపై నాకు పూర్తి విశ్వాసముంది. పార్టీలో నెం.2, నెం.3 పదవులు విశ్లేషణ బట్టి ఉంటాయి. ప్రశాంత్ కిశోర్ అలాంటి భ్రమల్లో ఉంటే నేనేం చేయలేను. 
నితీశ్ కుమార్, బీహార్ సీఎం


మూడు రోజులు క్రితం ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారితీసింది. జేడీయూలో ఎన్నికల నిర్వహణ, ప్రచార బాధ్యతలను రామచంద్రప్రసాద్ సింగ్ వంటి సీనియర్లు చూస్తున్నారని... సహకరించడం వరకే తన పని చెప్పుకొచ్చారు.  పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని పరోక్షంగా వెల్లడించారు. దాంతో నితీష్‌పై పీకే అసంతప్తితో ఉన్నారని... జేడీయూలో కుమ్ములాటలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం జేడీయూ ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నారు ప్రశాంత్ కిశోర్.  జేడీయూలో నితీష్ కుమార్ తర్వాత ఆయనదే ప్రముఖ పాత్ర అని  పార్టీలో చేరినప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది.  పార్టీ నేతలు సైతం ఆయన్ను నెం.2గా చూశారు. ఐతే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పొత్తులు, సీట్ల  పంపిణీ వంటి బాధ్యతలను తనకు కాకుండా రామచంద్రప్రసాద్‌కు ఇవ్వడం పట్ల ప్రశాంత్ కిశోర్ అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.   గతంలో పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్...ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. 
First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు