• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PRANAB MUKHERJEE PM MODI PRESIDENT RAMNATH KOVIND AND POLITICAL LEADERS CONDOLES PRANAB MUKHERJEES DEATH SK

Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ప్రణబ్ ముఖర్జీ (File Photo)

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

  • Share this:
    భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరన్న వార్తతో యావత్ దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో అనేక ఉన్నత పదవులను అలంకరించిన ప్రణబ్ దాదా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీతో పాటు రాజకీయ ప్రముఖలంతా సంతాపం తెలిపారు. మన దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. ఆయన పాదాలను తాకిన ఫొటోను జత చేశారు.









    ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: