ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: March 29, 2019, 3:47 PM IST
ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్
ప్రకాశ్ రాజ్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: March 29, 2019, 3:47 PM IST
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సినీ నటుడు ప్రకాష్ రాజ్...తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో వెల్లడించారు. కర్ణాటకలోని బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు తెలిపారు.

2019 న్యూ ఇయర్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్... తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.  ఈ ఏడాది ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించినప్పడి నుంచి తనకు పలువురు మద్దతు వ్యక్తంచేశారని తెలిపిన ప్రకాష్ రాజ్...వారికి ధన్యవాదులు తెలిపారు.

ఇది కూడా చదవండి
Loading...
కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం... ఎంపీగా పోటీ చేయనున్న ప్రకాష్ రాజ్
First published: January 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...