టీఆర్ఎస్, బీజేపీలది అరాచకమన్న కాంగ్రెస్.. ఈసీకి ఫిర్యాదు

Telangana assembly elections 2018|తెలంగాణ ఎన్నికల పోలింగ్‌లో టీఆర్ఎస్, బీజేపీలు అరాచకం సృష్టిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇలాంటి చర్యలతో మహాకూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: December 7, 2018, 3:58 PM IST
టీఆర్ఎస్, బీజేపీలది అరాచకమన్న కాంగ్రెస్.. ఈసీకి ఫిర్యాదు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 7, 2018, 3:58 PM IST
రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడులను తెలంగాణ పీసీసీ తీవ్రంగా ఖండించిది. ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు కలిసిపోయి అరాచకం సృష్టిస్తున్నాయని.. టీపీసీసీ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి గెలుపును నియంత్రించలేరని స్పష్టం చేశారు. ఉదయం నుంచి జరుగుతన్న పరిణామాలపై టీపీసీసీ నేత కోదండరెడ్డి నేతృత్వంలోని మహాకూటమి బృందం.. రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసింది. పోలింగ్ సందర్భంగా టీఆర్ఎస్,బీజేపీ నేతలు .. ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడుకలకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దాడులపై పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
మహాకూటమి అభ్యర్థి వంశీచందర్ రెడ్డిపై బీజేపీ నేతలు దాడి చేయడం అమానుషమని.. మహాకూటమి నేతలు అన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై దాడులకు దిగుతున్నాయన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.


First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...