కూటమి వద్దు మొర్రో అన్నా.. వింటేగా?: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఏడు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కోమటిరెడ్డి అంచనా వేశారు.


Updated: January 5, 2019, 7:32 PM IST
కూటమి వద్దు మొర్రో అన్నా.. వింటేగా?: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి file
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఓ కాంగ్రెస్ నేత కూటమికి వ్యతిరేకంగా గళం విప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెదవి విప్పారు. ప్రజాకూటమి వద్దని తాను ఎన్నికల ముందే చెప్పానని కోమటిరెడ్డి అన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై అభ్యర్థులు తమ అభిప్రాయాలను తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు వద్దని తన అభిప్రాయాన్ని చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీట్లు పంచుకోలేని వాళ్లు.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తారనే అభిప్రాయాన్ని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగారని కోమటిరెడ్డి అన్నారు. ప్రజలు కూడా కేసీఆర్ మాటలను నమ్మారని, ప్రజాకూటమి గెలిస్తే మళ్లీ చంద్రబాబు పాలన వస్తుందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే, కనీసం 40 నుంచి 45 సీట్లు గెలిచి ఉండేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. తన లాంటివారు కూడా ఓడిపోవడానికి పొత్తులే కారణమని కోమటిరెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఏడు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కోమటిరెడ్డి అంచనా వేశారు. హైకమాండ్ తనకు టికెట్ ఇస్తే నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు.

First published: January 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>