• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • PRAGATHI BHAWAN TO BE RENAMED AS SLAVES BHAWAN EETALA RAJENDER SLAMS CM KCR SK

Telangana: అది ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయం.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఎదురుదాడి

ఈటల రాజేందర్ (ఫైల్)

బయట వ్యక్తులు లోపలికి వచ్చారని.. అదే సమయంలో లోపలి వ్యక్తులను బయటకు పంపిస్తున్నారని సీఎం కేసీఆర్‌ను ఈటల విమర్శించారు. మీకు ఎవ్వరూ లేనప్పుడు మేమే అండగా ఉన్నామన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు

  • Share this:
    టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా.. సీఎం కేసీఆర్‌పై ఎదురుదాడికి దిగారు ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా మారిందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్ పేరును 'బానిసల నిలయం'గా మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్. ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతుకమంటే.. తాను బతకలేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, గజకర్ణ గోకర్ణ టక్కుటమారా విద్యలను హుజురాబాద్ ప్రజలు బొంద పెడతారని అన్నారు. హరీష్ రావు, వినోద్ రావు వచ్చినా ఏం చేయలేరని తెగేసి చెప్పారు ఈటల రాజేందర్. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని.. ఆత్మగౌరవం కోసం కొట్లాడేవారని ఆయన స్పష్టంచేశారు.

    ''ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే నేను బతకను. కోపం అనే నరాన్ని, రోషం అనే నరాన్ని కట్ చేశారు. మీకన్నా ఉన్నతంగా ఉండాలని నేనెప్పుడూ కోరలేదు. కేటీఆర్ సీఎం అయినా ఆయన కింద పనిచేస్తానని చెప్పాను. అయినా కుట్ర చేశారు. పొట్టోడి నెత్తిని పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తిని పోశమ్మ కొట్టిందని కేసీఆర్ అంటుంటారు. నా నెత్తిని మీరు కొట్టే ప్రయత్నం చేశారు. మీ నెత్తి కొట్టేవారు కూడా వస్తారు. మీరు లాలూ ప్రసాద్‌లా, మాయవతిలా, జయలలితలా పెట్టిన పార్టీ కాదు. నా వెంట ఎవరూ లేరు.. నేను, నా భార్య మాత్రమే ఉన్నామని చెబితే అందరం వచ్చాం. ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేశాం. అందరం కొట్లాడితేనే రాష్ట్రం వచ్చింది.'' అని ఈటల రాజేందర్ అన్నారు.

    బయట వ్యక్తులు లోపలికి వచ్చారని.. అదే సమయంలో లోపలి వ్యక్తులను బయటకు పంపిస్తున్నారని సీఎం కేసీఆర్‌ను ఈటల విమర్శించారు. మీకు ఎవ్వరూ లేనప్పుడు మేమే అండగా ఉన్నామన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో మంత్రి పదవి రాలేదని.. కష్టపడి పనిచేస్తే వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. విజయశాంతి, ఆలె నరేందర్, కోదండరామ్‌ను కూడా ఇలాగే బయటకు పంపించారని.. టీఆర్ఎస్ పార్టీలలో ఎంతో మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఆయన పాలనలో మంత్రులు ఎవరూ స్వేచ్ఛగా చేయలేరని.. ఐఏఎస్ అధికారులు కూడా బాధతోనే పనిచేస్తున్నారని విమర్శించారు.

    తెలంగాణ ఉద్యమాన్ని విరమిస్తే రూ.50వేల కోట్లు ఇస్తామని ఆనాడు ఆంధ్రా నేతలు ఆఫర్ ఇచ్చారని.. కానీ తాము తిరస్కరించామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ చెప్పారు. డబ్బుల కన్నా తెలంగాణ ఆత్మగౌరవమే ముఖ్యమని కొట్లాడి.. రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అంతా ఒక్కటయ్యే సమయం వచ్చిందని.. దీన్ని ఎవరూ ఆపలేరని తెగేసి చెప్పారు ఈటల రాజేందర్. కాగా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, తులా ఉమతో పాటు మరికొందరు నేతలు కూడా కూడా ఈటల రాజేందర్ వెంట ఉన్నారు. వారు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో మరికొందరు నేతలు కూడా తమతో కలిసి వస్తారని ఆయన చెప్పారు. అందరం చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు ఈటల.

    ఇది కూడా చదవండి:

    Telangana: ఈటల రాజీనామా.. టీఆర్ఎస్‌కు గుడ్‌బై.. సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు
    Published by:Shiva Kumar Addula
    First published: