news18-telugu
Updated: October 23, 2019, 3:23 PM IST
ఫ్రగతి భవన్ (Image: Facebook)
ప్రతిపక్షాల ప్రగతి భవన్ ముట్టడి ఓ పోలీస్ అధికారి బదిలీకి కారణమైంది. మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాంది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతల్ని ప్రగతి భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే బుధవారం ఏబీవీపీ కార్యకర్తలు కూడా ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ప్రగతి భవన్ గేట్లు దూకి ఏబీవీపీ కార్యకర్తలు లోపలకి చొచ్చుకెళ్లారు. 300 మంది పోలీసుల కళ్లుగప్పి లోపలకి వెళ్లారు. దీంతో పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోశామహల్ స్టేషన్కు తరలించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన తెలంగాణ ప్రభుత్వం విధుల్లో అలసత్వం వహించడంతో ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు వేసింది. నరసింహారెడ్డి ప్రగతిభవన్ ముందు ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆసిఫ్ నగర్ సబ్ డివిజన్ బాధ్యతలు డీసీపీ సుమతికి అప్పజెప్పారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
October 23, 2019, 3:20 PM IST