Home /News /politics /

PPCC CHIEF NAVJOT SINGH SIDHU PROMISES TO TURN MOHALI INTO SILICON VALLEY IN NORTHERN INDIA IF CONGRESS WINS IN PUNJAB SNR

అక్కడ మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్లాన్..సిద్ధూ ఇచ్చిన ఆ హామీతో ఓట్లు పడేనా

Photo Credit:Twitter

Photo Credit:Twitter

PUNJAB ELECTIONS: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ కొత్త రాగం అందుకుంది. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ని గెలిపిస్తే మొహాలీని ఉత్తర భారతదేశపు సిలికాన్‌ వ్యాలీగా మార్చేస్తామని హామీ ఇచ్చారు పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ. అంతే కాదు ఐటీ హహ్‌గా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని మాటిచ్చారు.

ఇంకా చదవండి ...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుపు కోసం కొత్త హామీలను తెరపైకి తెస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌(Punjab)లో పాగా వేసేందుకు బీజేపీ(Bjp),ఆమ్‌ ఆద్మీ పార్టీ (APP)ప్రయత్నిస్తుంటే..అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ (Congress)మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ది చేసి చూపిస్తామని శపథం చేస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ (PPCC chief Navjot Singh Sidhu)ఓ గొప్ప హామీని పంజాబ్‌ ప్రజల ముందుకు తెచ్చారు. 2022అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మొహాలీMohali ని ఉత్తర భారతదేశపు సిలికాన్‌ వ్యాలీ(Silicon Valley in northern India)గా మార్చేస్తామని మాటిచ్చారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించి వేరే దేశాలు, రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్న వారికి ఇక్కడే ఉద్యోగవకాశాలు కల్పించేలా ఓ ప్రత్యేకమైన రోడ్‌ మ్యాప్‌road mapని తయారు చేస్తున్నామని ప్రకటించారు. ముఖ్యంగా పంజాబ్‌లోని మొహాలీని ఐటీ హబ్‌(It Hub)గా మార్చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్టార్టప్‌ సిటీ(Startup city),ఎడ్యుకేషనల్‌ సిటీ(Educational city)గా మార్చడంతో పాటు అధునాతన యంత్రాల క్లస్టర్‌గా మొహాలీని మార్చేయాలని అనుకుంటున్నట్లుగా వెల్లడించారు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ.
పంజాబ్‌లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రాష్ట్రానికి టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌(Elon musk)ని ఆహ్వానిస్తామన్నారు. పంజాబ్‌కి వచ్చి లుథియానా(Ludhiana)లో అతిపెద్ద ఈవీ పరిశ్రమను సృష్టించమని ఆయన్న కోరుతామని వెల్లడించారు.

హస్తం పార్టీ అభివృద్ధి జపం..
పంజాబ్‌లో ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గత ఐదేళ్లలో ఏం చేసిందో చెప్పమని విపక్షాలు నిలదీస్తుంటే..సిద్ధూ మాత్రం మరోసారి ఛాన్సివ్వండి పంజాబ్‌ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం ఎన్నికల్లో ఓటర్లు, యువతను ఆకర్షించేందుకే అనే విమర్శలు చేస్తున్నాయి మిగిలిన రాజకీయ పార్టీలు. ఇప్పటికే పంజాబ్‌ కాంగ్రెస్‌లో వచ్చిన చీలికలతో ప్రభుత్వం నిలబడటమే కత్తి మీద సాములా మారింది. అలాంటిది మరోసారి కూడా తమకే అధికారం కట్టబెట్టమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోరడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్నికల కోసమే అని పంజాబ్‌ ప్రజలు కూడా భావిస్తున్నారు.

ఈ ఐదేళ్లు ఏం చేశారన్నదే విపక్షాల ప్రశ్న..
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌జిత్‌సింగ్‌ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆప్ విమర్శిస్తోంది. ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారని వాటికి లెక్కలు చెప్పాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి విమర్శల మధ్య కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇస్తున్న హామీలు ఎంత వరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Assembly Election 2022

తదుపరి వార్తలు