Tamil Nadu Assembly: తమిళనాడులో మెగా బ్రదర్స్ క్రేజ్.. అసెంబ్లీలో పవన్ ప్రస్తావన

తమిళనాడు అసెంబ్లీలో పవన్ ప్రస్తావన

Pawan Kalyan: మెగా బ్రదర్స్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ అదే క్రేజ్ ఉంది. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యణ్ పేర్లను తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావించారు. పవన్ చేసిన ట్వీటును సభలో వినిపించారు.

 • Share this:
  Tamil Nadu Assembly: మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Chiranjeevi Pawan kalyan) ల క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల(Telugu states)తో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ అదే క్రేజ్ ఉంది. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM Stalin) పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు. మరికొన్ని గంటలకే ఆయన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్వయంగా వెళ్లి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కలిశారు.. ఈ రెండు అంశాలను తమిళనాడు అసెంబ్లీ (Tamilnadu Aseembly)లో ప్రస్తావనకు వచ్చాయి. డిఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ని ప్రస్తావించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనపై ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.  ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల తరువాత మెగాస్టార్ చిరంజీవి నేరుగా తమిళనాడు  సీఎం స్టాలిన్ ను కలిశారు. సీఎం ను పొగడ్తల్లో ముంచెత్తుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.

  తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ ను అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ ట్వీట్ ని తెలుగులో చదివి వినిపించారు. ఈ సందర్భంలో అసెంబ్లీలోని మిగిలిన ఎమ్మెల్యేలు, సీఎం స్టాలిన్ చిరునవ్వులు చిందించారు..పవన్ కళ్యాణ్ ట్విట్ తో పాటు,  చిరంజీవి కలిసిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎం స్టాలిన్ పై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు.

  ఇంతకీ ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అంటే.. సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని చాలామంది మాటల్లో చెపుతారు కానీ.. తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) మాత్రం దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. అంటూ పవన్ ట్వీట్ చేశారు.

    
  Published by:Nagesh Paina
  First published: