ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీ‌కి నిజామాబాద్ అభ్యర్థుల విజ్ఞప్తి

‘నియోజకవర్గంలోని ప్రజల్లోకి మా ఎన్నికల గుర్తులను తీసుకెళ్లడానికి మాకు సమయం కావాలి. కాబట్టి నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలను పది రోజులు వాయిదా వేయాలి.’ అని రైతులు కోరారు.

news18-telugu
Updated: April 2, 2019, 10:42 PM IST
ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీ‌కి నిజామాబాద్ అభ్యర్థుల విజ్ఞప్తి
ఎన్నికల కమిషన్ కార్యాలయం
  • Share this:
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న 170 మందికి పైగా రైతులు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలను పది రోజులు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న నిజామాబాద్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ప్రచారం చేసుకోవడానికి గడువు ఇవ్వాలని కోరారు. అందుకోసం పది రోజుల పాటు ఎన్నికలను వాయిదా వేయాలని రైతులు కోరారు. అలాగే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని వారు ఈసీకి విజ్ఞప్తి చేశారు.

‘ఎన్నికలకు ముందు నుంచే ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తులపై ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు, పోటీ చేస్తున్న రైతులు ఎన్నికల గుర్తు చివర్లో కేటాయించారు. మా గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పూర్తిగా అవకాశం ఇవ్వాలి. నియోజకవర్గంలోని ప్రజల్లోకి మా ఎన్నికల గుర్తులను తీసుకెళ్లడానికి మాకు సమయం కావాలి. కాబట్టి నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలను పది రోజులు వాయిదా వేయాలి.’ అని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ధ్రువీకరించారు.

పసుపు, మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గత కొన్నాళ్లుగా పోరాడిన రైతులు బ్యాలెట్ పోరుకు సిద్ధమయ్యారు. నిజామాబాద్‌లో మొత్తం 185 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 178 మంది రైతులే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత కూడా బరిలో ఉన్నారు. అయితే, నిజామాబాద్‌లో కూడా ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
First published: April 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading