Home /News /politics /

POSTPONE NIZAMABAD POLLS BY 10 DAYS FARMERS FILES PETITION IN TELANGANA HIGH COURT

నిజామాబాద్‌‌లో ఎన్నిక వాయిదా వేయండి..హైకోర్టుకు రైతుల వినతి

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు, తమ పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు మరింత సమయం కావాలని నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న రైతులు కోరుతున్నారు. ఎన్నికను వాయిదావేసేలా ఈసీని ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఇంకా చదవండి ...
    నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలను వాయిదావేయాలంటూ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికను కనీసం 10 రోజులు వాయిదావేయాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న రైతులు చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది.  దీంతో వారు గురువారం ఉదయం  హైకోర్టు‌లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ ఎన్నికలను రెండోవిడతలో నిర్వహించాలంటూ అన్నదాతలు విన్నవించుకున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇక్కడ రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం తెలిసిందే. దీంతో ఇక్కడి నుంచి తెలంగాణలోనే అత్యధిక స్థాయిలో 185 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో దాదాపు 170 మంది పసుపు, మొక్కజొన్న రైతులే ఉన్నారు.  రైతులను శాంతింపజేసేందుకు సిట్టింగ్ ఎంపీ కవిత, టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలు తగిన ఫలితాన్ని ఇవ్వలేదు. నామినేషన్లు భారీ సంఖ్యలో ఉండడంతో...ఇక్కడ బ్యాలట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని తొలుత భావించిన ఎన్నికల సంఘం...ఆ తర్వాత ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

    farmers crowd at nizamabad collectorate to file election nominations'
    నామినేషన్లు వేసేందుకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు భారీగా చేరుకున్న రైతులు


    అయితే నిబంధనల మేరకు నిజామాబాద్‌లో బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నారు. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును కోరారు. అలాగే తమకు కేటాయించిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని, ప్రచారం కోసం కేటాయించిన సమయం చాలదని రైతులు చెబుతున్నారు.  ఇవాళ మధ్యాహ్నంపైన ఈ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది.
    Published by:Janardhan V
    First published:

    Tags: Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad, Nizamabad S29p04, Telangana Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు