రేవంత్ రెడ్డిపై పోసాని ఫైర్... కేటీఆర్ అవినీతిని నిరూపిస్తే...

‘రేవంత్ రెడ్డి రూ.50లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఈరోజుల్లో ఇలా దొరికిన వ్యక్తి ఎవరూ లేరు.’ అని పోసాని అన్నారు.

news18-telugu
Updated: June 7, 2020, 5:29 PM IST
రేవంత్ రెడ్డిపై పోసాని ఫైర్... కేటీఆర్ అవినీతిని నిరూపిస్తే...
పోసాని కృష్ణ మురళి
  • Share this:
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. జన్వాడలోని ఫాం హౌస్‌ను కేటీఆర్ అక్రమంగా జీవో 111 నిబంధనలను అతిక్రమించి నిర్మించారంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించింది. ఎన్జీటీ దర్యాప్తునకు ఆదేశించడంతో కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన పోసాని.. ‘ఎన్జీటీ దర్యాప్తునకు ఆదేశిస్తే... మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఏంటి? ఇది ఎక్కడి లాజిక్ నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి రూ.50లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఈరోజుల్లో ఇలా దొరికిన వ్యక్తి ఎవరూ లేరు. ఇలాంటి వ్యక్తి.. కేటీఆర్ ను రాజీనామా చేయమనడం ఏంటి? ఉన్న మంచి రాజకీయ నాయకుని పై బురదజల్లడం ఏంటి? కేటీఆర్, హరీష్ రావు నిజాయితీపరులైన రాజకీయనేతలు. వీళ్ళే భవిష్యత్ తెలంగాణ కు రెండు కళ్ళ లాంటి వారు.’ అని కృష్ణమురళి అన్నారు. ఫాం హౌస్ విషయంలో ఇప్పటికే కేటీఆర్ స్పందించారు. దానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్లే కేటీఆర్ ఉంటారని, ఎక్కడ ఎలా ఉండాలో కేటీఆర్ కు బాగా తెలుసని పోసాని చెప్పారు. కేటీఆర్ అవినీతి ని ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే రేపటి నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతానని ప్రకటించారు. టీఆర్ఎస్ ను ఓడించాలని రాజకీయాలు చేస్తే.. ఎప్పటిరీ ప్రతి పక్షంలోనే ఉంటారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే, తెలంగాణలో మూడింట రెండు వంతుల భూమి సశ్యశ్యామలం అవుతుందని పోసాని చెప్పారు. ఇంత మంది ప్రాజెక్టు కడితే కమిషన్ కోసం కాళేశ్వరం కట్టారంటూ ఉత్తమ్, జానారెడ్డిలాంటి వారు విమర్శించడం తగదన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో కట్టారని, అప్పుడు కమిషన్ల కోసమే కట్టారంటే ఎలా ఉంటుందో, ఇప్పుడు కాళేశ్వరంలో కమిషన్ అంటే కూడా అలాగే ఉంటుందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 7, 2020, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading