జగన్ పొడవడు, పొడిపించుకోడు... టీడీపీపై పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు..

‘కేసీఆర్ చెప్తే జగన్ వింటారు. జగన్ రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కరించుకుంటారు.’ అని పోసాని అన్నారు.

news18-telugu
Updated: June 7, 2020, 5:48 PM IST
జగన్ పొడవడు, పొడిపించుకోడు... టీడీపీపై పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు..
పోసాని కృష్ణ మురళి, ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
తెలుగుదేశం పార్టీ మీద నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విమర్శలు గుప్పించారు. తన స్టైల్లో ఆయన టీడీపీ మీద మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అక్కడున్నది ఎన్టీఆర్ కాదని, జగన్ అని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటూ పరోక్షంగా చెప్పిన పోసాని... ‘ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి. జగన్. ఆయన పొడవడు. పొడిపించుకోడు. ఏపీ లో ప్రతిపక్ష నేతలు అసత్యాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఉంటే ఏం జరుగుతుందో జగన్ ను చూస్తే తెలుస్తుంది.’ అని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదంపై కూడా పోసాని స్పందించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారన్నారు. ‘ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహం ఉంది. కేసీఆర్ చెప్తే జగన్ వింటారు. జగన్ రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కరించుకుంటారు.’ అని పోసాని అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 7, 2020, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading