POOJA CHAVAN DEATH CASE SHIV SENA MINISTER SANJAY RATHOD RESIGN SK
Pooja Chavan Death Case: సోషల్ మీడియా స్టార్ మృతి కేసుపై దుమారం.. శివసేన మంత్రి రాజీనామా
సంజయ్ రాథోడ్
పూజా.. తన ఇంటి పైనుంచి పడి మరణించడం సంచలనం రేపింది. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. అందులో ఇద్దరు వ్యక్తులు పూజ మృతి గురించి మాట్లాడారు. ఆ ఇద్దరిలో ఒకరు సంజయ్ రాథోడ్ అని బీజేపీ ఆరోపిస్తోంది
సోషల్ మీడియా స్టార్ పూజ చవాన్ (22) అనుమానాస్పద మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా చేశారు. ఉదయం సీఎం ఉద్ధవ్ థాక్రేను కలిసిన ఆయన.. అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. నీచ రాజకీయాల వల్లే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు సంజయ్ రాథోడ్ రాజీనామా చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల పూజా చవాన్ ఫిబ్రవరి 8న అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఫుణెలో తన సోదరుడు, అతడి మిత్రులతో కలిసి ఆమె నివసిస్తోంది. బంజారా సామాజికవర్గానికి చెందిన పూజ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. తన కమ్యూనిటీ గురించి వీడియోలు పోస్ట్ చేసింది. అలాంటి పూజా.. తన ఇంటి పైనుంచి పడి మరణించడం సంచలనం రేపింది. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. అందులో ఇద్దరు వ్యక్తులు పూజ మృతి గురించి మాట్లాడారు. ఆ ఇద్దరిలో ఒకరు సంజయ్ రాథోడ్ అని బీజేపీ ఆరోపిస్తోంది.
కొన్ని రోజుల క్రితం మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డీజీపీని కలిసి ఆడియో క్లిప్పులను సమర్పించి.. కేసు గురించి వివరించారు. పూజా మృతిపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజకీయ దుమారం రేగడంతో.. ఇవాళ మంత్రి సంజయ్‌ను తన కార్యాలయానికి పిలిచారు సీఎం ఉద్ధవ్ థాక్రే. తన సతీమణితో పాటు సీఎం కార్యాలయానికి వెళ్లి సంయ్ రాథోడ్.. ఆయనకు రాజీనామాను సమర్పించారు. ఐతే ఆయన కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశారని.. యువతి హత్య కేసు నుంచి తప్పించుకోలేరని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సంజయ్2ను వెనకేసుకు రాకుండా నిష్ఫక్షపాత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.