టీఆర్ఎస్‌లో ఎంపీ పదవి... జగన్‌పైనే ఆ నేత ఆశలు ?

కేసీఆర్ చెప్పినట్టు నడుచుకుని ఖమ్మం లోక్ సభ సీటును నామాకు త్యాగం చేసిన తనకు ఈ సారి కచ్చితంగా కేసీఆర్ రాజ్యసభ సీటు ఇస్తారని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 21, 2020, 4:30 PM IST
టీఆర్ఎస్‌లో ఎంపీ పదవి... జగన్‌పైనే ఆ నేత ఆశలు ?
జగన్, కేసీఆర్ (File)
  • Share this:
టీఆర్ఎస్ నుంచి త్వరలోనే రాజ్యసభకు వెళ్లబోయే ఆ ఇద్దరు నేతలు ఎవరనే దానిపై చాలాకాలం నుంచి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కవితకు రాజ్యసభ సీటు ఇస్తారా ? కేకే’కు మళ్లీ రెన్యూవల్ ఉంటుందా ? అనే అంశంతో పాటు మరో కొత్త నేతకు ఛాన్స్‌పై కూడా ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచి ఆ తరువాత టీఆర్ఎస్’లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి... రాజ్యసభ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఆయనకు రాజ్యసభ సీటు ఖాయమనే ప్రచారం కూడా సాగుతోంది.

కేసీఆర్ చెప్పినట్టు నడుచుకుని ఖమ్మం లోక్ సభ సీటును నామాకు త్యాగం చేసిన తనకు ఈ సారి కచ్చితంగా కేసీఆర్ రాజ్యసభ సీటు ఇస్తారని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... రాజ్యసభ సీటు విషయంలో పొంగులేని ఏపీ సీఎం జగన్ సాయం కూడా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నంచి టీఆర్ఎస్‌లోకి వచ్చినప్పటికీ... ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పటికీ సత్సంబంధాలే ఉన్నాయి.

టీఆర్ఎస్‌లో ఎంపీ పదవి... జగన్‌పైనే ఆ నేత ఆశలు ? | Ponguleti srinivasa reddy seeks ap cm ys jagan help to get rajya sabha seat from trs ak
పొంగులేటి శ్రీనివాసరెడ్డి( ఫైల్ ఫోటో)


టీఆర్ఎస్, వైసీపీ మధ్య మంచి సంబంధాలు నెలకొనడంలో పొంగులేటి తనవంతు కృషి చేశారనే టాక్ ఉంది. అలాంటి పొంగులేని తనకు టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సీటు వచ్చేలా చేయాలని సీఎం జగన్ ద్వారా కూడా లాబీయింగ్ చేయిస్తున్నారనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో సాగుతున్నాయి. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీటు ఖాయమైతే... దాని వెనుక సీఎం జగన్ హస్తం కూడా ఉన్నట్టే అనుకోవాలనే టాక్ వినిపిస్తోంది.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు