Nagarjunasagar by election : ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..ఓటును వినియోగించుకున్న అభ్యర్థులు

ఓటు వేసేందుకు వెళుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి భగత్

నాగార్జునసాగ‌ర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొన‌సాగుతుంది. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు.

  • Share this:
నాగార్జునసాగ‌ర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొన‌సాగుతుంది. ఎక్కడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగుతోంది. ఎండకాలం కావడంతో ఓటర్లు ఉదయమే బారులు తీరారు. దీంతో ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్‌ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.
కాగా క‌రోనా బాధితుల‌కు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పించనున్నారు. ఉప ఎన్నిక‌ల్లో 41 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలివగా , మొత్తం 346 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

కాగా మొత్తం నియోజకవర్గంలో నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు. ఇక కరోనా నేపథ్యంలో ఎలాంటీ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు పక్కగా అమలు పరుస్తున్నారు. మాస్క్ వేసుకుని వస్తున్న వారినే క్యూలోకి అనుమతి ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ అభ్యర్థి నోముల భగత్ ఉదయం ఏడుగంటలకే తన ఓటు హక్కును కుటుంభసభ్యులతో కలిసి హాలియాలోని ఇబ్రహింపట్నంలో వినియోగించుకున్నారు.
Published by:yveerash yveerash
First published: