టీడీపీ ఖేల్‌కతమ్.. బీజేపీతోనే మాకు పోటీ: వైసీపీ ఎమ్మెల్యే

రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ కార్యకర్తలంతా వైసీపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలకు కంటికి రెప్పలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

news18-telugu
Updated: September 9, 2019, 3:10 PM IST
టీడీపీ ఖేల్‌కతమ్.. బీజేపీతోనే మాకు పోటీ: వైసీపీ ఎమ్మెల్యే
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • Share this:
ఏపీలో అధికార వైసీపీ బలంగా ఉంది. ఇతర పార్టీల నుంచి నేతలు వలసలు బాగానే పరిగాయి. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను లాగేసుకుంది. కానీ టీడీపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీ నుంచి నేతలు ఒక్కరుగా జారిపోతుండడంతో కేడర్‌లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిస్థితులపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన తురక సూరి


ఏపీలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నెల్లూరులో పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమక్షంలో మాజీ కార్పొరేటర్ తురకా సూరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ కార్యకర్తలంతా వైసీపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలకు కంటికి రెప్పలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
Published by: Shiva Kumar Addula
First published: September 9, 2019, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading