హోమ్ /వార్తలు /National రాజకీయం /

Political News: ఏపీలో వైసీపీని వెనక్కు నెట్టిన టీడీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ దే నెంబర్ వన్ ప్లేస్..

Political News: ఏపీలో వైసీపీని వెనక్కు నెట్టిన టీడీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ దే నెంబర్ వన్ ప్లేస్..

వైసీపీ ని వెనక్కు నెట్టిన టీడీపీ

వైసీపీ ని వెనక్కు నెట్టిన టీడీపీ

Political News: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఫుల్ జోష్ లో ఉంది. గత సాధారణ ఎన్నికల్లో 151 సీట్లుతో ఘన విజయం సాధించింది.. అక్కడ నుంచి ఆ పార్టీ వెనుతిరిగి చూసుకోవడం లేదు. ఎన్నికల్లో విపక్షాల డిపాజిట్లు అన్నీ గల్లంతు అవుతున్నాయి. ఎన్నిక ఏదైనా ఇతర పార్టీలు కనీస పోటీ ఇవ్వలేకపోతున్నాయి.. కానీ ఒక విషయంలో మాత్రం టీడీపీ.. అధికార వైసీపీని వెనక్కు నెట్టింది.

ఇంకా చదవండి ...

Political News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ప్రస్తుతం నెంబర్ వన్ పార్టీ ఏది అంటే టక్కున వైఎస్ఆర్సీపీ (YSRCP)అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ సాధిస్తున్న ఫలితాలు అలాంటివి. ఉప ఎన్నికైనా.. మున్సిపల్ ఎన్నికలైనా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలైనా ఫలితాలు వన్ సైడే అని చెప్పాలి. ఆ మధ్య తిరుపతి (Tirupati) ఎంపీ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ, బీజేపీలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి.. ఇక రీసెంట్ గా జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ (Badvel By poll)వైసీపీ అభ్యర్థి రికార్డు విజయం సాధించింది. పోటీ ఇస్తామని చెప్పిన రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయాయి.. ఉప ఎన్నికలే కాదు.. ఎన్నిక ఏదైనా వైసీపీదే విక్టీరీ అవుతోంది. ప్రత్యర్థి పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి. అంతేకాదు ప్రస్తుతం విపక్ష పార్టీ నేతలు చాలా మంది.. అధికార వైసీపీ కండువా కప్పుకోవాలని ఆరాటపడుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా అన్నింటిలో నెంబర్ గా వైసీపీ ఉంటే.. ఒక్క విషయంలో మాత్రం ఏపీలో అధికార వైసీపీని.. తెలుగు దేశం పార్టీ క్రాస్ చేసింది. నెంబర్ వన్ స్థానంలో నిలిచింది..

టీడీపీ ఎందులో ముంది అనుకుంటున్నారా..? దేశ వ్యాప్తంగా అత్యధిక విరాళాలు సేక‌రించిన ప్రాంతీయ పార్టీలలో మొద‌టి స్థానంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ కు విరాళాల‌లో రూపంలో 89 కోట్లు వచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌లో టీఆర్ ఎస్ కే అత్య‌ధికం. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌తి ప‌క్ష పార్టీ అయిన టీడీపీ రెండో స్థానంలో నిలవడం విశేషం. టీడీపీ కి విరాళాల రూపంలో 81 కోట్ల రూపాయలు వ‌చ్చాయి. అయితే ఏపీలో ఉన్న అధికార పార్టీ వైసీపీ మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి : సీఎంకు విశ్రాంతి అవసరం అన్న వైద్యులు.. ఇంతకు జగన్ కు ఏమైంది.. ఎన్నిరోజుల విశ్రాంతి అవసరం..

వైసీపీ కి విరాళాల రూపం లో రూ. 74 కోట్లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఏడీఆర్ అనే సంస్థ విడుద‌ల చేసింది. అయితే ఏడీఆర్ విడుదల చేసిన ఈ జాబితాపై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు టీడీపీ గురించి జనాలే పట్టించుకోవడం లేదని.. విరాళాలు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.. విరాళాలు ఇవ్వాలి అనుకున్న వారి వైసీపీకి ఇస్తారు కానీ.. టీడీపీ ఎందుకు ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి : సీఎంకు విశ్రాంతి అవసరం అన్న వైద్యులు.. ఇంతకు జగన్ కు ఏమైంది.. ఎన్నిరోజుల విశ్రాంతి అవసరం..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల కు గుర్తు తెలియని వ్య‌క్తుల నుంచి వ‌చ్చిన మొత్తం విరాళాల విలువ 445.77 కోట్ల రూపాయలు ఉంటాయ‌ని ఏడీఆర్ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీక‌లు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి వ‌చ్చిన విరాళాల‌లో దాదాపు 95 శాతం ఎల‌క్ట్రోర‌ల్ బాండ్ల రూపం లోనే వ‌చ్చాయ‌ని ఏడీఆర్ తెలిపింది. అయితే ఈ జాబితా ప్రకారం ప్రాంతీయ పార్టీ ల‌లో ఎక్కువ విరాళాలు సేక‌రించిన మొద‌టి మూడు స్థానాల‌లో మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న ప్రాంతీయ పార్టీ లే ఉండ‌టం మరో విశేషం..

First published:

Tags: Andhra Pradesh, AP News, Politics, TDP, Telangana, Trs, Ycp

ఉత్తమ కథలు