Home /News /politics /

Telangana Politics: ఆ రెండు పార్టీల నేతలే దీదీ టార్గెట్.. తెలంగాణలో అడుగుపెడుతున్న మమత..?

Telangana Politics: ఆ రెండు పార్టీల నేతలే దీదీ టార్గెట్.. తెలంగాణలో అడుగుపెడుతున్న మమత..?

తెలంగాణ రాజకీయాల్లోకి మమత

తెలంగాణ రాజకీయాల్లోకి మమత

Trinamool Congress In Telangana: జాతీయ రాజకీయాలను శాశించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మమతా బెనర్జీ.. ఒకప్పుడు బెంగాల్ కే పరిమితమైన ఆమె.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడడంతో.. ఈ ప్లేస్ ను భర్తీ చేయ దిశగా కసర్తతు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ తానే సరైన ప్రత్యర్థి అనే సంకేతాలిస్తున్న ఆమె కన్ను ఇప్పుడు తెలంగాణపై పడింది.

ఇంకా చదవండి ...
  Trinamool Enter in telangana Politics: తెలంగాణ (Telangana ) రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారుతున్నాయి. గత ఎన్నికలకు అసలు ప్రతిపక్షాలే లేవు.. కారు వారు వన్ సైడ్ అన్నట్టు ఉండేది.. సీఎం కేసీఆర్ (CM KCR) మాటల తూటాలకు ప్రతిపక్షం అన్న పదమే వినిపించకూండా పోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. టీఆర్ఎస్ (TRS) కు ధీటుగా ఢీ అంటే ఢీ అంటోంది జాతీయ పార్టీ బీజేపీ, మొదట దుబ్బాక, తరువాత హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కారుకు పంక్చర్ అయ్యింది.. బీజేపీ వికసించింది. అందుకే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంటూ బీజేపీ (BJP) మరింత దూకుడు పెంచింది. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మొన్నటి వరకు కాంగ్రెస్ ఉందా అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రేసులోకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలకు తోడు వైఎస్ రాజకీయ వారసురాలు.. షర్మిల (YS Sharimila) కూడా తెలంగాణ రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. కేసీఆర్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ కు షాక్ ఇచ్చేందుకు మమత బెనర్జీ (mamata benarji) సై అంటున్నారు...

  ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ తెలంగాణలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ చేసినట్టు సమాచారం. కేవలం బెంగాల్ కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ఆమె ముందుకెళ్తున్నారు. ఇందులోభాగంగా కొద్దిమంది కాంగ్రెస్‌ కీలక నేతలతోపాటు టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్టు తెలిసింది. వారిలో కొందరితో ఇప్పటికే మాట్లాడినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని వారు.. మమతా నాయకత్వంపై నమ్మకం ఉన్నవారు.. ఆమెవైపు చూస్తున్నట్టు పొలిటికల్ టాక్.

  ఇదీ చదండి : తిరుమల భక్తులను వెంటాడుతున్న భయం.. ఘాట్‌ రోడ్డు మూసివేత.. తృటిలో తప్పిన ప్రమాదం

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే బాధ్యతలను మమతా బెనర్జీ ఇటీవల కీలక నేతలకు అప్పగించా రు. దీనిలో భాగంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాలు, వాటి బలహీనతలు తదితర అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు దీదీ. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బ్యాక్‌ఎండ్‌ వర్క్‌ చేస్తున్న ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఈనెల మొదటి వారంలో అధినేత్రికి నివేదికివ్వనున్నట్టు సమాచారం.

  ఇదీ చదండి : వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ఉచిత వైద్యం బంద్.. ఒమిక్రాన్ నేపథ్యంలో సీఎం నిర్ణయం

  మొన్న పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీకి సవాల్ విసిరి.. దీదీ నెగ్గారు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ దాటి విజయం సాధించారు. అప్పుడు తానే కేంద్రానికి అసలైన ప్రత్యామ్నాయ అని మాట్లాడరు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టే ప్రత్యర్ధి పార్టీ లేదనే చెప్పాలి.. కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడింది. ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీకి అనుకూల పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు బదులు తానే.. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అయితే బెటరని దీదీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గోవా, అస్సాం, త్రిపుర, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో తృణమూల్‌ కాం గ్రెస్‌ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమైంది.

  ఇదీ చదండి : లక్షణాలు లేవని లైట్ తీసుకుంటున్నారా..? మీరు ఆరోగ్యంగానే ఉన్నారా..? ఇలా తెలుసుకోండి.?

  ఆ తరువాత టార్గెట్ తెలంగాణపై పడినట్టు సమాచారం. పార్టీ విస్తరణకు అవకాశాలున్నట్టు గుర్తించారని, అందుకే ఇక్కడ పార్టీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలతో తృణమూల్‌ సీనియర్‌ నేత ఒకరు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్న కొంతమంది అధికార పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపైనా వారితో మాట్లాడినట్లు తెలిసింది. ఇటీవలి హుజురాబాద్‌ ఎన్నికలపైనా తృణమూల్‌ అధినేత్రికి సంబంధిత ఏజెన్సీ పూర్తి నివేదిక అందించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ సాధించిన ఓట్ల విషయంలోనూ లోతైన అధ్యయనం చేసి మరీ నివేదిక అందించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మరోపార్టీకి వెసులుబాటు ఉంటుందని బెంగాల్‌ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: CM KCR, Mamata Banarjee, Telangana, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు