AP Politics: మ‌ళ్లీ భ‌గ్గుమంటున్న తాడిప‌త్రి రాజ‌కీయం.. అగ్గి రాజుకోవడానికి కారణం ఇదేనా..?

భగ్గుమంటున్న తాడిపత్రి రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాలు (Andhra Pradesh Politics) మొత్తం ఒక ఎత్తైతే అనంతపురం జిల్లా తాడిప‌త్రి రాజ‌కీయాలు మ‌రో ఎత్తు.

 • Share this:
  M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాలు మొత్తం ఒక ఎత్తైతే అనంతపురం జిల్లా తాడిప‌త్రి రాజ‌కీయాలు మ‌రో ఎత్తు. ఇక్క‌డ జ‌రిగిన ఏ చిన్న రాజకీయ క‌ద‌లికైన రాష్ట్రం దృష్టిని ఇట్టే ఆక‌ర్షిస్తుంది. ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి అక్క‌డ ఏర్ప‌డింది అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం అక్క‌డ పెద్దా రెడ్డి, జేపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌ధ్య అధిప‌త్య పోరు పీక్స్ కి చేరుకుంది. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఈ ఇద్ద‌రి రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగిన అది స్థానికంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఎన్నిక‌లు ఎవైనా కావ‌చ్చు ఇక్క‌డ మాత్రం యుద్ధ వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తుంది. ఏ పార్టీ నుంచి ఓడిన నేత‌లైనా త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఖ‌చ్చితంగా రిట‌ర్న్ గిప్ట్ ఉంటుంద‌ని ప్ర‌త్య‌ర్ధ‌ల‌కు స‌వాల్ విసురుతుంటారు అంత‌టి వాడి వేడిగా ఉంటాయి ఇక్క‌డ రాజ‌కీయాలు. అయితే తాజాగా తాడిప‌త్రిలో రాజ‌కీయాలు మ‌ళ్లీ భ‌గ్గుమంటున్నాయి.

  మొన్న‌టికి మొన్న ఎమ్యెల్యే పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికి వెళ్ల‌డంతో అక్క‌డ ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెలకొంది. దాదాపు ప‌ది రోజులు పాటు ఈ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కొన‌సాగిందంటే ఎలాంటి పరిస్థితులు ఎంత సీరియస్ గా మారాయో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఒక ఆల‌య వివాదం పెద్దారెడ్డి, ప్రభాక‌ర్ రెడ్డిల మ‌ధ్య వర్గాల మరోసారి వైరానికి కార‌ణ‌మైంది. నియోక‌వ‌ర్గంలో ఉన్న జూటూరు గ్రామంలోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహా ఆల‌యానికి సంబంధించిన వివాదం ఇప్పుడు ఈ ఇద్ద‌రు ప్ర‌త్యేర్ధుల మ‌ధ్య మ‌ళ్లీ అగ్గిని రాజేస్తోంది.

  ఇది చదవండి: శ్రీవారి ఖజానాలో పేరుకుపోయిన పాతనోట్లు.. కేంద్రం కరుణిస్తుందా..?  1940 నుంచి ఈ ఆల‌యం జేసీ వ‌ర్గీయుల ఆధీనంలో ఉంది వారే క‌మిటీ స‌భ్యులుగా ఉన్నారు కూడా. అయితే తాజా ఈ ఆల‌యాన్ని ఎమ్మెల్యే పెద్దా రెడ్డి దేవాదాయ‌శాఖ ప‌రిధిలోకి తీసుకొచ్చి ప్ర‌భాక‌ర్ రెడ్డి కుటుంబ అధిప‌త్యానికి చెక్ పెట్టారు. దీంతో మళ్లీ రెండు వర్గాల మధ్య పొలిటికల్ ఫైటింగ్ మొదలైంది. తాజాగా జేసీ కుటుంబం ఆల‌యంలో యాగం చేయ‌డానికి నిర్ణ‌యించ‌డంతో దీనికి దేవాదాయ శాఖ అధికారులు నిరాక‌రించారు అంతేకాకుండా ఇప్ప‌టివ‌ర‌కు జేసీ కుటుంబం ఆదీనంలో ఉన్న ఆయ‌ల హుండీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

  ఇది చదవండి: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్... కీలక జీవో సస్పెండ్


  క‌ళ్యాణ మండపం తాళాలు కూడా దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవ‌డంతో తాము నిర్మించిన దేవాల‌యంలో త‌మ అదిప‌త్యం లేక‌పోవ‌డంతో ర‌గిలిపోతున్నారు జేపీ అండ్ కో ఇప్పుడు ఇదే తాడిపత్రిలో ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణానికి తేర‌తీసింది. గ‌త కొన్ని రోజులుగా కూల్ గా ఉన్న తాడిప‌త్రిలో ఇప్పుడు ఈ వివాధం ఎటువంటి ప‌రిణామాల‌కు దారితీస్తోందోన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఆసక్తిగా చూస్తున్నారు.

  ఇది చదవండి: ప్రియురాలి మోజులో భర్త... ఆమె భర్తతోనే మర్డర్ ప్లాన్ వేసిన భార్య.. చివరికి ఏమైందంటే..

  Published by:Purna Chandra
  First published: