Home /News /politics /

గోవా కాంగ్రెస్‌లో కుదుపు.. పార్టీ వీడిన 10 మంది ఎమ్మెల్యేలు

గోవా కాంగ్రెస్‌లో కుదుపు.. పార్టీ వీడిన 10 మంది ఎమ్మెల్యేలు

గోవా స్పీకర్‌కు రాజీనామా లేఖలు సమర్పిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

గోవా స్పీకర్‌కు రాజీనామా లేఖలు సమర్పిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే..గోవా కాంగ్రెస్ కూడా అనిశ్చితిని ఎదుర్కొంటుండం గమనార్హం.

    కర్ణాటక రాజకీయ అనిశ్చితి పొరుగునే ఉన్న గోవాకూ పాకింది.గోవా కాంగ్రెస్‌కు చెందిన 10మంది ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం స్పీకర్‌ను కలిసి.. పార్టీని వీడుతున్నట్టు రాజీనామా లేఖలు సమర్పించారు.అంతేకాదు, పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. గోవాలో కాంగ్రెస్‌కు మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా..  వారిలో అటనాసియో, జెనిఫర్, ఫ్రాన్సిస్ సిల్వెయిరా, ఫిలిప్ రొడ్రిగ్, క్లియోఫాసియో, విల్‌ఫ్రెడ్, నికాంత్ హలాంకర్, ఫెర్నాండెజ్ అనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో సీఎం ప్రమోద్ సావంత్, డిప్యూటీ స్పీకర్ మైకెల్ లోబో కూడా అక్కడే ఉన్నారు.

    కాగా, కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే..గోవా కాంగ్రెస్ కూడా అనిశ్చితిని ఎదుర్కొంటుండం గమనార్హం. ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ గోవాలో అతిపెద్ద పార్టీగా ఉంది. గోవా ఫార్వర్డ్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు,నేషనల్ కాంగ్రెస్ పార్టీ,మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Goa, Goa politics, Karnataka political crisis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు