• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • POLITICAL DRAMA CONTINUING IN TADIPATHRI AS TDP SUPPORTERS IN CAMP IN BENGALURU FULL DETAILS HERE PRN

తాడిపత్రిలో కొనసాగుతున్న హైడ్రామా… క్యాంపులోనే టీడీపీ.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..

తాడిపత్రిలో కొనసాగుతున్న హైడ్రామా… క్యాంపులోనే టీడీపీ.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..

జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

AP Municipal Elections: మొత్తం 36 స్థానాలున్న తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ 18, వైసీపీ 16 వార్డుల్లో విజయం సాధించగా.. సీబీఐ, ఇండిపెండెంట్ ఒక్కో చోట గెలిచారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసినా.. ఛైర్మన్ పదవుల విషయంలో మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాడిపత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో ఆధిక్యాన్ని సాధించిన టీడీపీ తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు వారిని రహస్య శిబిరానికి తరలించింది. ఓ వైపు టీడీపీ తమ అభ్యర్థులు చేజారకుండా వారిని కాపాడుకుంటోంది. మరోవైపు వైసీపీ మాత్రం.. టీడీపీ శిబిరంలోని వారిని ఆకర్షించేందుకు శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది. ఫలితాలు వచ్చిన వెంటనే తమ కౌన్సిలర్లను టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ కు తరలించారు. అక్కడి నుంచి బెంగళూరు తరలించినట్లు తెలుస్తోంది.

    టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో ఆ పార్టీ తరపున గెలిచిన 18 మంది కౌన్సిలర్లతో పాటు ఒక సీపీఐ, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ ఉన్నారు. ఛైర్మన్‌ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకే మద్దతిస్తామనే స్పష్టమైన హామీతోనే ఇతరులిద్దరూ శిబిరంలో కొనసాగుతున్నారు. 20 మందిలో ఏ ఒక్కరూ చేజారే అవకాశం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ప్రతిపాదించే ఛైర్మన్‌ అభ్యర్థికే తాము మద్దతిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రెడ్డికి ముందుగానే విప్‌ సమర్పించారు.

    ఇది చదవండి: సీఎం సొంత జిల్లాలో వైసీపీకి షాక్.. రాజీనామా చేసిన కౌన్సిలర్..



    మొత్తం 36 స్థానాలున్న తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ 18, వైసీపీ 16 వార్డుల్లో విజయం సాధించగా.. సీబీఐ, ఇండిపెండెంట్ ఒక్కో చోట గెలిచారు. వైసీపికి ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండటంతో వారి సంఖ్య 18కి చేరింది. ఐతే టీడీపీ బలం 20గా ఉండటంతో ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

    ఇది చదవండి: తిరుపతిలో పోటీపై డైలమాలో ఆ రెండు పార్టీలు.. అభ్యర్థిని ప్రకటించినా లాభం లేదా..?



    వైసీపీ కొత్త వ్యూహం
    తాడిపత్రి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు వైసీపీ సరికొత్త వ్యూహానికి పదునుపెట్టింది. ఛైర్మన్ పదవిని మైనార్టీలకు ఇస్తామని ప్రకటించింది. తాడిపత్రిలో గెలిచిన 36 మందిలో 11 మంది ముస్లింలో ఉన్నారు. దీంతో తమ పార్టీ తరపున ముస్లింలకే ఇస్తామని వైసీపీ తెలిపింది. రెండు పార్టీల తరపున ఐదుగురు చొప్పున ముస్లింలు విజయం సాధిచండంతో వైసీపీ ఇచ్చిన ఆఫర్ తో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ విషయంలో వైసీపీ మరో వ్యూహాన్ని కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా కోరం హాజరుకాకుండా చేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీతో పాటు సీబీఐ, స్వతంత్ర కౌన్సిలర్లను ఎన్నికకు హాజరుకాకుండా చూసేందుకు ప్రయత్నిస్తే.. మరింత సమయం దొరుకుతుందనేది అధికార పార్టీ ఆరోచన.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు