అందుకే ఓడిపోయాం... చంద్రబాబుకు టీడీపీ పొలిట్‌బ్యూరో నేతల వివరణ

ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ పొలిటిబ్యూరో చర్చించింది. ఓటమికి గల కారణాలపై నేతలు చంద్రబాబుకు తమ అభిప్రాయాలను వివరించారు.

news18-telugu
Updated: August 9, 2019, 4:09 PM IST
అందుకే ఓడిపోయాం... చంద్రబాబుకు టీడీపీ పొలిట్‌బ్యూరో నేతల వివరణ
చంద్రబాబు (File)
  • Share this:
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారిగా సమావేశమైన టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉద్విగ్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో తనకు అర్థంకావడం లేదంటూ పదే పదే చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఓటమికి కారణాలు చెప్పాలంటూ పార్టీ నేతలను కోరినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో అపజయం, ఓటింగ్ సరళిపై నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఉద్వేగానికి లోనయ్యారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, కష్టపడిన తీరును అయ్యన్న గుర్తుచేశారు.

ఇంత చేసినా ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. అన్న క్యాంటీన్ల మూసివేతతో అందరు బాధపడుతున్నారని ఆయన మరోసారి కండతడి పెట్టుకోవడంతో ఇతర నాయకులు ఆయనను సముదాయించారు. ఎన్నికల్లో వైసీపీలా డబ్బు ఖర్చు చేయలేకపోయామని కొందరు సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ తరహాలోనే టీడీపీ పొలిట్‌బ్యూరోని కూడా ప్రక్షాళన చేస్తే బాగుంటుందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.

గత ఐదేళ్లలో చంద్రబాబు పడిన కష్టాన్ని పలువురు నేతలు గుర్తుచేసుకున్నారు. సామాజిక సమీకరణలో విఫలమయ్యామని మరికొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, భవిష్యత్‌పై దృష్టిపెట్టి సామాజిక సమీకరణ విస్మరించామని నేతలు తమ వాదన వినిపించారు. ఎన్నికల్లో కొందరు నేతలు అతి విశ్వాసం వల్ల ఓడారని, మరికొందరు సరిగా పనిచేయకపోవడం వల్ల ఓడారని నేతలు చంద్రబాబుకు వివరించారు.First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు