పోలీస్ వర్సెస్ వర్ల రామయ్య... ఏపీలో ముదురుతున్న వివాదం

పోలీస్ వర్సెస్ వర్ల రామయ్య... ఏపీలో ముదురుతున్న వివాదం

వర్ల రామయ్య వర్సెస్ పోలీసులు

తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఖండించడం తప్పా..? అని ప్రశ్నించారు. పోలీస్ శాఖను కించపరిచేలా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

 • Share this:
  ఏపీలో పోలీస్ యూనియన్, టీడీపీ నేత వర్ల రామయ్య మధ్య వివాదం ముదురుతోంది. పోలీసుల జాతకాలన్నీ తనకు తెలుసని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న వర్ల రామయ్య వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో తన పట్ల ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ అవమానకరంగా మాట్లాడారని.. అంతు చూస్తానంటూ భయపెట్టారని వర్ల రామయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

  శ్రీనివాస్ ఒక రాజకీయ ప్రత్యర్థిగా మాట్లాడుతున్నాడు. పోలీస్ అధికారుల సంఘం నాయకుడిగా అలా మాట్లాడే హక్కు అతనికి లేదు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల్ని అంతు చూస్తానని అన్నప్పుడు, నెల్లూరులో సీఐపై దాడి చేసినప్పుడు, విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీస్ కమిషనర్‌ను జగన్ తిట్టినప్పుడు..ఎందుకు మాట్లాడలేదు. ఎందుకు మీసం తిప్పలేదు. ఇటువంటి వారు పోలీస్ నాయకులుగా ఉండకూడదు.
  వర్ల రామయ్య

  మరోవైపు వర్లరామయ్యకు ఏపీ పోలీస్ యూనియన్ మరోసారి కౌంటర్ ఇచ్చింది. తమకు ఏ పార్టీ, కులంతోనూ సంబంధం లేదని.. తమని ఖాకీ కులమని స్పష్టం చేశారు శ్రీనివాస్. వర్ల రామయ్యది ఏ కులమో తనకు తెలియదని.. ఖాకీ యూనిఫాం వేసుకున్నందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టంచేశారు.

  నాకు రాజకీయాల పై ఆసక్తి లేదు. పులిని‌ చూసి నక్క‌ వాత పెట్టుకున్నట్లుగా నేను‌ చేయను. మా పోలీసు వేదిక పై నుంచి వర్ల రామయ్య కు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. మా శాఖ లో పని‌చేసిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే మాకు‌ బాధ కలిగింది. మాది ఖాకీ కులమే తప్ప... మరే కులాలతో మాకు సంబంధం లేదు. ఈ ఖాకీ డ్రెస్ వేసుకున్నందుకు ప్రాణ త్యాగానికైనా నేను సిద్దంగా ఉన్నా.
  శ్రీనివాస్

  పోలీస్ అనేది ఒక వ్యవస్థ.. ఎవరైనా చట్టానికి లోబడే పని చేస్తారని అభిప్రాయపడ్డారు పోలీస్ యూనియన్ నాయకులు. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఖండించడం తప్పా..? అని ప్రశ్నించారు. పోలీస్ శాఖను కించపరిచేలా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
  Published by:Shiva Kumar Addula
  First published: