తెలంగాణ భవన్‌లో రవాణా శాఖ మంత్రికి అవమానం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: January 4, 2020, 4:36 PM IST
తెలంగాణ భవన్‌లో రవాణా శాఖ మంత్రికి అవమానం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
  • Share this:
తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్, కార్పొరేషన్ ఛైర్మన్‌లంతా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి పువ్వాడ కూడా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు మంత్రిని అడ్డుకున్నారు. పువ్వాడను తనిఖీలు చేసి అనంతరం లోపలికి పంపించారు. దీంతో మంత్రి తీవ్ర అసహనానికి లోనయ్యారని సమాచారం. అంతేకాదు ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏ నియోజకవర్గంలో అయినా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే.. ఆ బాధ్యత మంత్రులదే అన్నారు. అలాంటివాళ్లు మంత్రి పదవులు వదులుకోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన విస్త్రత స్థాయి సమావేశంలో సుమారు 300 మంది వరకు ముఖ్యనేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Published by: Sulthana Begum Shaik
First published: January 4, 2020, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading