HOME »NEWS »POLITICS »police stopped bjp leaders protest at raamatheerdha and denied permission to visit temple prn

Ramatheerdham Incident: రామతీర్థంలో టెన్షన్... టెన్షన్..! సీఎం జగన్ కు సోము వీర్రాజు వార్నింగ్

Ramatheerdham Incident: రామతీర్థంలో టెన్షన్... టెన్షన్..! సీఎం జగన్ కు సోము వీర్రాజు వార్నింగ్
బీజేపీ ఛలో రామతీర్థంలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన (Ramatheerdham Incident) పై రాజకీయ రగడ కొనసాగుతోంది. రామతీర్థం రాముడ్ని దర్శించుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రామతీర్థం రాముడ్ని దర్శించుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈనెల 5న పోలీసులు ఛలో రామతీర్థాన్ని భగ్నం చేశారు. ఈనేపథ్యంలో రామతీర్థం వెళ్లి తీరతామన్న బీజేపీ నేతలు మరోసారి ఛలో రామతీర్థానికి  పిలుపునిచ్చారు. మూడు రోజులుగా విశాఖపట్నంలోనే మకాం వేసిన బీజేపీ నేతలు.., ఇవాళ విశాఖ నుంచి రామతీర్థం బయలుదేరారు. విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే దారిలో ప్రధాన కూడళ్లలో భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసుల వలయాలను దాటుకుంటూ నెలిమర్ల జంక్షన్ కు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జాతీయ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలను పోలీసులు అడ్డుకున్నారు.

    దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కార్యకర్తలు వారిద్దరికీ మంచినీళ్లు తాగించి సపర్యలు చేశారు. మరోవైపు రాముడ్ని దర్శించుకునే వరకు రామతీర్థాన్ని విడిచిపెట్టేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డిని అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



    ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నట్లు సోము తెలిపారు. రామతీర్థం దర్శనానికి తమను అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభువానికి నష్టమేంటని ప్రశ్నించారు. పోలీసులతో దమనకాండ చేయిస్తారా..? రాముడికి అపకారం జరిగితే సీఎం జగన్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సీఎం జగన్.., బీజేపీకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బేషరతుగా తమను రామమందిరానికి అనుమతించాలన్నారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వ ద్వంద వైఖరిపై ప్రజాపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని ప్రభుత్వం దిగివచ్చే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

    రామతీర్థం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు సీఐడీ దర్యాప్తు జరుగుతున్నందున ఆలయ ప్రవేశం నిషేధించినట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఉద్దేశపూర్వకంగానే రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
    Published by:Purna Chandra
    First published:January 07, 2021, 10:49 IST