అతని కారు నంబర్ ప్లేట్‌ 'AP CM Jagan'.. షాక్ తిన్న పోలీసులు

మంగళవారం జీడిమెట్ల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ కారు వారి కంటపడింది. దీంతో వెంటనే కారును ఆపిన పోలీసులు.. నంబర్ ప్లేట్‌కు బదులు AP CM Jagan అని ఎందుకు రాయించుకున్నావని ప్రశ్నించారు.

news18-telugu
Updated: October 23, 2019, 6:53 AM IST
అతని కారు నంబర్ ప్లేట్‌ 'AP CM Jagan'.. షాక్ తిన్న పోలీసులు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)
news18-telugu
Updated: October 23, 2019, 6:53 AM IST
హైదరాబాద్‌కి చెందిన ఓ యువకుడు తన కారు నంబర్ ప్లేట్‌పై 'ఏపీ సీఎం జగన్' అని రాయించుకున్నాడు. మంగళవారం జీడిమెట్ల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ కారు వారి కంటపడింది. దీంతో వెంటనే కారును ఆపిన పోలీసులు.. నంబర్ ప్లేట్‌కు బదులు AP CM Jagan అని ఎందుకు రాయించుకున్నావని ప్రశ్నించారు. అయితే టోల్ రుసుం మినహాయింపు కోసం అలా రాయించుకున్నానని కారు యజమాని ముప్పిడి హరి రాకేశ్ తెలిపాడు. దీంతో కారును సీజ్ చేసిన అధికారులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముప్పిడి రాకేశ్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...