సత్తెనపల్లిలో ఉద్రిక్తత : కోడెలపై దాడి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోడెల శివప్రసాదరావు (File)

దాడి చేసింది ఎవరనేది గుర్తించేందుకు గ్రామమంతా జల్లెడ పడుతున్నారు. గ్రామం నుండి ఎవరినీ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

  • Share this:
    స్పీకర్ కోడెలపై దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సీసీటీవి ఫుటేజీ సహాయంతో నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సత్తెనపల్లి డివిజన్ నుంచి 50 మంది పోలీసుల బృందం శనివారం ఇనుమెట్లకు చేరుకుంది. దాడి చేసింది ఎవరనేది గుర్తించేందుకు గ్రామమంతా జల్లెడ పడుతున్నారు. గ్రామం నుండి ఎవరినీ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

    కాగా, ఏప్రిల్ 11వ తేదీన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్లలో స్పీకర్ కోడెలపై దాడి జరిగింది. కోడెల పోలింగ్ బూత్‌ వద్దకు రావడాన్ని నిరసిస్తూ..ఆయనపై దాడికి దిగారు. కోడెల కారును ధ్వంసం చేశారు. దాడిలో కోడెల దుస్తులు చిరిగిపోయాయి. ఆయనతో పాటు డ్రైవర్‌కి గాయాలయ్యాయి. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దాడికి సంబంధించిన వీడియోలను పరిశీలించారు పోలీసులు.

    First published: