హోమ్ /వార్తలు /National రాజకీయం /

Minster Suresh: విద్యార్థి సంఘాల ముసుగులో దాడి.. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు వద్దంటూ మంత్రి సరేష్ ఫైర్

Minster Suresh: విద్యార్థి సంఘాల ముసుగులో దాడి.. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు వద్దంటూ మంత్రి సరేష్ ఫైర్

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (ఫైల్)

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (ఫైల్)

Minster Adimulapu Suresh Fire on TDP: అనంతపురంలో విద్యార్థులపై పోలీస్ లాఠీ ఛార్జ్ వివాదం రాజకీయ టర్న్ తీసుకుంది. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ ఈ ఇష్యూని రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఇంతకీ వాస్తవం ఏంటి.?

ఇంకా చదవండి ...

Minster Adimulapu Suresh:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసుల తీరు మరోసారి విదాస్పదమైంది. అనంతపురం (anantapuram)లో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన విద్యార్ధులపై పోలీసు జులుం ప్రదర్శించారు. దీంతో  ఎయిడెడ్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం (AP Government) చదువులను వ్యాపారం చేస్తోందని ధర్నాలో విద్యార్థులు మండిపడ్డారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఆందోళన (Students Protest)లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. దపోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.  దీంతో పోలీసుల తీరుకు నిరసగా తరువాత మీడియా సమావేశానికి వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ (Minster Adimulapu Suresh) ను విద్యార్థులు అడ్డుకున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. దీంతో ఆయన మధ్యలోనే ప్రెస్ మీట్ ను ఆపేయాల్సి వచ్చింది.

అనంతపురం ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు దుండగులు అనంతపురం ఎస్ఎస్‌బీఎన్‌ కళాశాల విద్యార్థులపై దాడి చేశారని మంత్రి ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రతిపక్ష పార్టీలు ఆడుకోవద్దని హెచ్చరించారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ భవనంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఎస్‌ఎస్‌బీఎన్‌ ఘటన దురదృష్టకరమన్నారు. ఎస్‌ఎస్‌బీఎన్‌పై ఒక నివేదిక తీసుకున్నామన్న మంత్రి సురేశ్‌.. ఆ విద్యాసంస్థ 1991 నుంచి నడుస్తున్నట్టు వివరించారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కళాశాల వద్దని చెప్పినట్టు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూస్తున్న వారికి ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆకలితో అలమటిస్తున్న గిరిజన విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌ విద్యార్థులతో రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తెచ్చారని పేర్కొన్నారు. పోలీసులపై రాళ్లు, చెప్పులు వేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంస్కరణల్లో భాగంగానే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిలిపివేశామని, 400కు పైగా పాఠశాలల్లో సున్నా ప్రవేశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:ఆ ఒక్క కార్పొరేషన్ పరిస్థితి ఏంటి..? ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?

ఇదే ఘటనపై వైసీపీ నేత సజ్జల కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దెబ్బ తగిలిన అమ్మాయి జనం నుండి వచ్చిందని చూసినవాళ్ళు చెబుతున్నారు.. ఆ అమ్మాయితో లోకేష్ ఫోన్ లో మాట్లాడించారని పేర్కొన్నారు. అక్కడ ఘటనలో బయటి నుండి వచ్చిన శక్తులు ఉన్నారని తెలిపారు.

ఇదీ చదవండి: మూడు అంశాల పై క్లారిటీ.. అపరిష్కృత సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఎక్కడా బలవంతం చెయ్యడం లేదన్నారు. 2 వేల స్కూల్స్ కి.. 702 కు ఉన్న విధంగానే కొనసాగుతున్నాయని చెప్పారు. 1446 స్కూల్స్ టీచర్లను ప్రభుత్వానికి ఇచ్చారని పేర్కొన్నారు. 101 మొత్తం ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Ap minister suresh, AP News, AP Politics, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు