డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారని గుర్తు చేశారు. రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారని చంద్రబాబు అన్నారు.అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు అని వ్యాఖ్యానించారు.
Kodela Siva Prasadarao Suicide Case : కోడెల ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటిని కూడా బంజారాహిల్స్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇంటికి ఎవరొచ్చి వెళ్లినా..తమకు సమాచారం అందించాలని చెప్పారు.
టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.కోడెల సెల్‌ఫోన్ డేటా ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఆయన సెల్‌ఫోన్ ఎక్కడున్నది ఇంకా తెలియరానప్పటికీ.. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్ డేటా ప్రకారం.. ఈ నెల 16న ఉదయం 10గంటల ప్రాంతంలో గన్‌మెన్ ఆదాబ్‌తో 9సెకన్ల పాటు మాట్లాడినట్టు గుర్తించారు. అలాగే 9గం. నుంచి 10గం. మధ్యలో 10-12 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు సమాచారం. వీటన్నింటిని పోలీసులు విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు.కోడెల ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటిని కూడా బంజారాహిల్స్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇంటికి ఎవరొచ్చి వెళ్లినా..తమకు సమాచారం అందించాలని చెప్పారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని ఇప్పటికే సీజ్ చేసిన పోలీసులు.. ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.