కీలకం కానున్న కోడెల సెల్‌ఫోన్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు

Kodela Siva Prasad : సోమవారం రాత్రి బంజారాహిల్స్‌లోని కోడెల నివాసానికి వెళ్లి.. ఆయన ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. సీలింగ్ ఫ్యాన్ ఎత్తులో ఉండటంతో మూడు కుర్చీలను ఒకేదాంట్లో వేసుకుని పైకి ఎక్కినట్టు నిర్దారించారు.

news18-telugu
Updated: September 18, 2019, 7:39 AM IST
కీలకం కానున్న కోడెల సెల్‌ఫోన్..  స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు
కోడెల శివప్రసాదరావు (file)
news18-telugu
Updated: September 18, 2019, 7:39 AM IST
టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు ఆయన సెల్‌ఫోన్‌పై ఫోకస్ చేశారు. కేసు దర్యాప్తులో సెల్‌ఫోన్ డేటా కీలకంగా మారనుందని వారు భావిస్తున్నారు.కోడెల ఆత్మహత్య తర్వాత ఆయన సెల్‌ఫోన్ ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. బహుశా ఆయన కుటుంబ సభ్యుల వద్దే సెల్‌ఫోన్ ఉండి ఉంటుందని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. సెల్‌ఫోన్‌లో ఉన్న కాల్ లిస్ట్,రికార్డింగ్స్ వంటి వివరాలతో కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల ఎవరితో మాట్లాడారు..? ఎక్కువగా ఎవరితో సంభాషణలు జరిపారు..? కాల్ రికార్డింగ్స్ ఏవైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరపనున్నారు. అలాగే ఆయన వాట్సాప్‌ అకౌంట్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు.

కాగా,కేసుకు సంబంధించి ఇప్పటికే కోడెల సతీమణి శశికళ,కుమార్తె విజయలక్ష్మి,ఇంట్లో పనివాళ్లను విచారించారు. సోమవారం రాత్రి
బంజారాహిల్స్‌లోని కోడెల నివాసానికి వెళ్లి.. ఆయన ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. సీలింగ్ ఫ్యాన్ ఎత్తులో ఉండటంతో మూడు కుర్చీలను ఒకేదాంట్లో వేసుకుని పైకి ఎక్కినట్టు నిర్దారించారు. గతంలో ఆయన రాసుకున్న కొన్ని పత్రాలను సేకరించారు. సూసైడ్ నోట్‌ లాంటిదేమైనా దొరుకుతుందేమోనని వెతికినప్పటికీ.. అలాంటిదేమీ దొరకలేదని సమాచారం.కోడెల ఆత్మహత్య చేసుకున్న కేబుల్ వైర్‌ో పాటు ఆయన తీసుకున్న టిఫిన్ నమూనాలను విస్రా పరీక్షలకు పంపించారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...