అమరావతిలో 144 సెక్షన్

ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ రేపు అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చింది.

news18-telugu
Updated: July 29, 2019, 9:14 PM IST
అమరావతిలో 144 సెక్షన్
అమరావతి ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించారు. దీంతో పాటు 30 పోలీస్ యాక్ట్‌ను కూడా అమలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ముట్టడిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా అమరావతిలో 144 రూల్ అమల్లోకి తెచ్చారు. ఎలాంటి రాజకీయ ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలంటూ ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే, ఎస్సీలను వర్గీకరించడం అంటే వారి మధ్య చిచ్చు పెట్టడమే అంటూ ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీన్ని ఎంఆర్పీఎస్ తప్పుపట్టింది.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>