ఛలో అసెంబ్లీకి చంద్రబాబు పిలుపు... టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

ఆదివారం రాత్రి వరకు 48 నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారు.

news18-telugu
Updated: January 20, 2020, 7:55 AM IST
ఛలో అసెంబ్లీకి చంద్రబాబు పిలుపు... టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
చంద్రబాబు నాయుడు
  • Share this:
అమరావతిలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ ‌లు చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆదివారం రాత్రి వరకు 48 నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గృహనిర్బంధాలను, అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ, జేఏసీ నేతలను నిర్బంధించడం హేయమైన చర్య అంటూ విమర్శించారుజ నిరసన తెలిపే హక్కు వైసీపీ వాళ్లకే కాదు దేశ పౌరులందరికీ ఉందన్నారు. ఈ విధమైన అణచివేత చర్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమన్నారు చంద్రబాబు. అత్యవసర పరిస్థితుల్లోనూ దేశంలో ఇంత నిర్బంధం లేదన్నారు. తక్షణమే గృహనిర్బంధాలను ఎత్తివేయాలి చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను ఆపాలన్నారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు