తెలంగాణలో ఇంటర్ హీట్... ముట్టడి కట్టడికి విపక్ష నేతల ముందస్తు అరెస్ట్

ఈ రోజు ఇంటర్ బోర్డ్ వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు.

news18-telugu
Updated: April 29, 2019, 11:20 AM IST
తెలంగాణలో ఇంటర్ హీట్... ముట్టడి కట్టడికి విపక్ష నేతల ముందస్తు అరెస్ట్
కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హౌస్ అరెస్ట్
  • Share this:
తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. రోజురోజుకు ఇంటర్ ఫలితాలపై ఆందోళనలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంటర్ బోర్డు ముట్టడికి అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కిడకక్కడ విపక్ష నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరిని ఇళ్లు కదలనీయకుండా అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ బీజేపీ,టీజేఎస్,టీడీపీ,వామపక్ష నేతల్ని గృహ నిర్బంధం చేశారు. ముట్డడి కార్యక్రమానికి వెళ్లనీయకుండా ముందస్తు అరెస్ట్‌లు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు పొన్నాల, షబ్బీర్ అలీతో పాటు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాల్లో కూడా విపక్షనేతల్ని పోలీసులు కట్టడి చేశారు. మరోవైపు ఇంటర్ బోర్డు వద్ద కూడా పోలీసులు భద్రత పెంచారు. ఆందోళనకారుల్ని అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు.

నేతల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్న పోలీసులు


తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెసు నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రోజు ఇంటర్ బోర్డ్ వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులకు పాల్పడ్డారు. అక్రమ అరెస్ట్ లను తీవ్రంగా ఖండించారు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్. అరెస్ట్ లు చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారు.  అరెస్ట్ లు కాదు విద్యార్థులకు న్యాయం చేయండన్నారు. రాష్ట్రంలో హక్కులను కాల రాస్తున్నారన్నారు. పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బందిచడం అక్రమమన్నారు పొన్నం.
First published: April 29, 2019, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading