ఉండవల్లి లోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇవ్వడంతో టెన్షన్ నెలకొంది. దీంతో బాబు నివాసం భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. చంద్రబాబు ఇంటికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను సైతం నివాసం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో చంద్రబాబు నివాసం వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.