విశాఖలో వైసీపీ కార్యకర్తలపై కేసులు...

రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని అడ్డుకున్న ఘటనలో నిందితులపై కేసులు నమోదు అయ్యాయి.

news18-telugu
Updated: February 29, 2020, 9:29 PM IST
విశాఖలో వైసీపీ కార్యకర్తలపై కేసులు...
విశాఖ ఎయిర్‌పోర్టులో బైఠాయించిన చంద్రబాబు..
  • Share this:
రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని అడ్డుకున్న ఘటనలో నిందితులపై కేసులు నమోదు అయ్యాయి.చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై పోలీసులు కేసులు చేశారు. టీడీపీ నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో చంద్రబాబు యాత్రను నిరసిస్తూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ వ్యక్తి జేటీ రామారావుపై, వైసీపీ నాయకురాలు ఎన్.కృపాజ్యోతిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జేటీ రామారావు, కృపాజ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కొందరు టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం చంద్రబాబుకు విశాఖ పర్యటనలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబును అడ్డుకున్నాయి. అంతకు ముందు చంద్రబాబు కాన్వాయ్ మీద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు.

విశాఖ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు


ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టేందుకు విశాఖ వెళ్లిన చంద్రబాబుకు వైసీపీ నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. విశాఖకు రాజధాని రావడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వైసీపీ శ్రేణులు విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌ను ఎయిర్ పోర్టు దగ్గరే అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు... ఆయన కాన్వాయ్‌ను ముందుకు కదలనివ్వలేదు. కొన్ని గంటల ఉద్రిక్తత తర్వాత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు సీఆర్పీసీ 151 కింద నోటీసులు ఇచ్చారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానంలో పంపించి వేశారు.

చంద్రబాబును ముందుస్తు అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసుల నోటీసు


నేరం చేసేవారు, నేరం చేయడానికి సమాయత్తం అయ్యే వారికి ఇచ్చే సెక్షన్ 151 ను చంద్రబాబుకు ఇవ్వడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విశాఖలో ఆందోళనకారులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు సెక్షన్ 151 పేరు చెప్పి చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అధికార పార్టీకి చెందిన గొడవలు చేసిన వారిని వదిలేసి చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. పైగా మీ భద్రత కోసమే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుపట్టారు. 151 సీఆర్పీసీ కింద ఒక వ్యక్తి నేరం చేయకుండా అడ్డుకోవడానికి, వారిని కంట్రోల్ చేయడానికి ఇచ్చే నోటీసు అని, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతకు ఆ నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

మరోవైపు  చంద్రబాబును విశాఖలో అడ్డుకోవడంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 29, 2020, 9:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading