మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: December 3, 2019, 3:45 PM IST
మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
కొడాలి నాని(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మంగళగిరి టిడిపి నాయకులు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరరావు, నందం అబద్దయ్య, చావాలి ఉల్లయ్య తదితరులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని... ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు పోలీసులను కోరారు.

Police complaint against kodali nani, Kodali nani, ap minister, ysrcp, chandrababu naidu, tdp, mangalagiri, Police case, కొడాలి నాని, ఏపీ మంత్రి, వైసీపీ, చంద్రబాబునాయుడు, టీడీపీ, మంగళగిరి, పోలీస్ కేసు, ఏపీ న్యూస్, కొడాలి నానిపై కేసు
కొడాలి నానిపై టీడీపీ నేతల ఫిర్యాదు


టీడీపీ అధినేత చంద్రబాబుపై కొంతకాలంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న మంత్రి కొడాలి నాని... ఆయనపై వీలు దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ సైతం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను కొడాలి నానికి అప్పగించిందనే టాక్ వినిపిస్తోంది.First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>