ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. విశాఖ త్రీ టౌన్ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఏపీ సీఎం జగన్ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడుపై ఐపీసీ 153ఏ, 500, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్పై మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు(File)
వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థలో కూడా రౌడీయిజం పెరిగిపోయిందని... ముఖ్యమంత్రి జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నా... డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్టణం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని... ఇలాంటి ప్రాంతంలోకి కడప సంస్కృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అయ్యన్న విమర్శించారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ధ్వజమెత్తారు. దీనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఆయనపై కేసు నమోదైంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.