విజయవాడ - గుంటూరు ఆర్టీసీ బస్సులు రద్దు

విజయవాడ నుంచి గుంటూరు వైపుగా వెళ్లే ఆర్టిసి బస్సులను సైతం రద్దు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు సర్వీసులు రద్దు చేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

news18-telugu
Updated: January 20, 2020, 11:03 AM IST
విజయవాడ - గుంటూరు ఆర్టీసీ బస్సులు రద్దు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా చర్యలు చేపడుతుంది. రాజధాని విషయంలో అసెంబ్లీలో నేడు కీలక ప్రకటన చేసి బిల్లులకు ఆమోదం తెలపనుంది ప్రభుత్వం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ నిరసనకారుల్ని, టీడీపీ నేతల్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో ఇప్పటికే విజయవాడలో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు నుండి విజయవాడ నుంచి గుంటూరు వైపుగా వెళ్లే ఆర్టిసి బస్సులను సైతం రద్దు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు సర్వీసులు రద్దు చేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుల నుండి వచ్చే సూచనలు మేరకు సర్వీసులు పునరుద్దరిస్తామన్నారు.  మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలోనే నేడు చీకటి రోజు అంటూ విమర్శించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న నాయకుల్ని గృహనిర్భందాలు చేయడం దారుణం అన్నారు.

మరోవైపు ఇప్పటికే రాజధాని విషయంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలోనే మూడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విశాఖలో సచివాలయం ఏర్పాటు చేసి, హెచ్ఓడీ కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల అర్బన్ అథారిటీ డెవలప్ మెంట్‌కు కూడా ఆమోదం తెలిపింది. శాసన రాజధనిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖను, జ్యూడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలును ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు