Home /News /politics /

POLICE BREAKS TELANGANA CLP LEADER BHATTI VIKRAMARKA INDEFINITE FAST AND TOOK HIM TO NIMS HOSPITAL SB

భట్టీ దీక్ష భగ్నం... నిమ్స్ ఆస్పత్రికి తరలింపు

మల్లు భట్టి విక్రమార్క(ఫైల్ ఫోటో)

మల్లు భట్టి విక్రమార్క(ఫైల్ ఫోటో)

అయితే ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని భట్టి భీష్మించుకొని కూర్చున్నారు. తనకు వైద్యం అవసరం లేదంటూ ఆయన నిరాకరిస్తున్నారు.

    కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సీఎల్పీలో చీలిక వర్గాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ భట్టి దీక్షకు దిగారు. గత మూడు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని భట్టి భీష్మించుకొని కూర్చున్నారు. తనకు వైద్యం అవసరం లేదంటూ ఆయన నిరాకరిస్తున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Bhatti Vikramarka, Telangana, TS Congress, TS Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు