జగన్ ఇంటి వద్ద పదేళ్ల బాలుడు... అనుమానాస్పదంగా తిరుగుతూ...

వెంటనే ఆ అబ్బాయిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పదేళ్ల వయసున్న ఆ బాలుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

news18-telugu
Updated: June 1, 2019, 12:37 PM IST
జగన్ ఇంటి వద్ద పదేళ్ల బాలుడు... అనుమానాస్పదంగా తిరుగుతూ...
తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం
  • Share this:
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే తాడేపల్లిలోని కొత్త ఇంటికి మారిపోయారు. అయితే జగన్ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ అబ్బాయిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పదేళ్ల వయసున్న ఆ బాలుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ బుడతడు.. పోలీసుల్ని సైతం సైతం ఎదురుప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టాడు. తన పేరు శివకుమార్‌ అంటు తెలిపాడు చిన్నోడు. తన ఊరు బాలతిమ్మయ్యగారి పల్లె అని చెబుతున్నాడు.

జగన్ ఇంటి వద్ద తచ్చాడుతున్న పదేళ్ల బాలుడు శివకుమార్


అయితే ఊరి పేరు అయితే చెప్పాడు కానీ... అదెక్కడ ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండల పరిధిలో ఉందన్న వివరాలను పోలీసులు తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడిని శిశు సంరక్షణ కేంద్రం లేదా అనాథ బాలల ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. అయితే అనాథ ఆశ్రమానికి వెళ్లేందుకు బాలుడు అంగీకరించలేదు. మరోవైపు పోలీసులు అసలు పిల్లాడు సీఎం ఇంటికి ఎలా వచ్చాడన్న దానిపై విచారణ చేస్తున్నారు. అతనితో మరెవరైనా ఉన్నారా... కావాలనే బాలుడ్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు. దీంతో పాటు సీఎం జగన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేశారు.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>