పోలవరంలో రివర్స్ టెండరింగ్ సక్సెస్.. ప్రభుత్వానికి ఎంత ఆదా అంటే...

Polavaram Reverse Tendering | ఈ పనులను గత ప్రభుత్వం రూ.290 కోట్లకు అప్పగించింది. అయితే, తాజాగా అదే పనులకు రూ.231.47 కోట్లతో బిడ్ దాఖలైంది.

news18-telugu
Updated: September 20, 2019, 8:58 PM IST
పోలవరంలో రివర్స్ టెండరింగ్ సక్సెస్.. ప్రభుత్వానికి ఎంత ఆదా అంటే...
జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 20, 2019, 8:58 PM IST
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. 65వ నంబరు ప్యాకేజీ పనుల టెక్నికల్ బిడ్‌లను జలవనరుల శాఖ ఓపెన్ చేసింది. ఈ పనులను గత ప్రభుత్వం రూ.290 కోట్లకు అప్పగించింది. అయితే, తాజాగా అదే పనులకు రూ.231.47 కోట్లతో బిడ్ దాఖలైంది. మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థ సుమారు రూ.58 కోట్ల తక్కువకు టెండర్ దాఖలు చేసింది. ప్రభుత్వం అంచనా వ్యయం కంటే 15.6 శాతానికి బిడ్ దాఖలు చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదా కానుంది. ఈ టెండర్లలో మొత్తం ఆరు సంస్థలు పాల్గొన్నాయి. అత్యంత తక్కువ బిడ్ దాఖలు చేసిన మాక్స్‌ ఇన్ ఫ్రా కంపెనీకి టెండర్ దక్కే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పోలవరం ప్యాకేజీ నంబరు 65లో అప్పగించనున్న పనులు
919 మీటర్ల పొడవైన ఇరిగేషన్‌ టన్నెల్

లెఫ్ట్ ఫ్లాంక్ హెడ్ రెగ్యులేటర్
నావిగేషన్ లాక్


అప్రోచ్ ఛానల్-1,2 నిర్మాణం
నావిగేషన్ ఛానల్లో మిగిలిన పని
First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...