Home /News /politics /

POLAVARAM PROJECT MAY BE RENAMED AS YSR PROJECT SOON AFTER YS JAGAN MOHAN REDDY BECOME CM OF AP AK

ఏపీలో ‘వైఎస్ఆర్’ బ్రాండ్... పోలవరం నుంచే మొదలు ?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

వైఎస్ రాజశేఖర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

రాష్ట్రంలోని ఎన్టీఆర్, చంద్రన్న పేరుతో ఉన్న పథకాలను వైఎస్ఆర్ పేరుతో రీప్లేస్ చేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పథకాల పేర్ల సంగతి ఎలా ఉన్నా... ఏకంగా ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు పేరును మారుస్తారేమో అనే టాక్ వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఏ పార్టీ అధికారంలోకి వస్తే... ఆ పార్టీకి చెందిన నేతల పేర్లను పథకాలకు, ప్రాజెక్టులకు పెట్టుకోవడం ఇప్పుడు కామనైపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు రాజీవ్, ఇందిరా గాంధీ పేర్లు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, చంద్రన్న పేర్లు ఎక్కువ కనిపించాయి. తాజాగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక రాష్ట్రంలోని పథకాలకు, ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడతారనే ప్రచారం మొదలైంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్, చంద్రన్న పేరుతో ఉన్న పథకాలను వైఎస్ఆర్ పేరుతో రీప్లేస్ చేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పథకాల పేర్ల సంగతి ఎలా ఉన్నా... ఏకంగా ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు పేరును మారుస్తారేమో అనే టాక్ వినిపిస్తోంది.

    ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేయడమే. పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్ అని స్వయంగా వైఎస్ఆర్ నామకరణం చేశారు. ఇందిరాసాగర్ అని స్వయంగా వైఎస్ఆరే పేరు పెట్టడంతో... వైసీపీ ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. కొందరైతే ఏపీలో వైఎస్ఆర్ బ్రాండ్ పోలవరం పేరు మార్పుతోనే మొదలవుతుందని చర్చించుకుంటున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు కాకపోయినా... మిగతా పథకాలకు మాత్రం వైఎస్ఆర్ పేర్లు పెట్టడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో జగన్ రాకతో మళ్లీ వైఎస్ఆర్ బ్రాండ్ మొదలవుతుందా లేదా అన్న విషయంలో కొద్దిరోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Polavaram, Ys jagan mohan reddy, YSR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు