పోలవరంపై ఏపీకి కేంద్రం వినమృతతో కూడిన సలహా లేఖ

Polavaram Project Retendering | పోలవరం ప్రాజెక్టులో రీ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కేంద్ర లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.

news18-telugu
Updated: August 17, 2019, 5:16 PM IST
పోలవరంపై ఏపీకి కేంద్రం వినమృతతో కూడిన సలహా లేఖ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు అధారిటీ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్‌ చేయాలని భావిస్తోందని, దాన్ని మానుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తరఫున పోలవరం ప్రాజెక్టు అధారికి సీఈఓ ఆర్కే జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘ఆగస్ట్ 13న పోలవరం ప్రాజెక్టు అత్యవసర సమావేశం జరిగింది. పోలవరం ప్రస్తుత కాంట్రాక్ట్‌ను ముందస్తుగా ముగించి, రీ టెండరింగ్‌కు వెళ్లే అంశంపై చర్చ జరిగింది. ఇప్పుడు అత్యవసరంగా పోలవరం కాంట్రాక్ట్‌ను రద్దు చేసి రీ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు రీ టెండరింగ్‌కు వెళితే భవిష్యత్తులో ఊహించని పరిణామాలు ఎదరయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టుపై అనిశ్చితి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయితే, దాని వల్ల లబ్ధిపొందే వారి మీద సామాజిక, ఆర్థికంగా కూడా ప్రభావం చూపుతుంది. వీటితోపాటు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. మన సమావేశానికి సంబంధించిన చర్చల సారాంశం నివేదిక మా ఆఫీసుకు మరికొన్ని రోజుల్లో వస్తుంది. మీ ఆఫీసుకు కూడా త్వరలో అందుతుంది. ఏదేమైనా.. మీకు మా వినమృపూర్వక సలహా ఏంటంటే.. పోలవరం కాంట్రాక్ట్‌ను రద్దు చేసి పనులు రీటెండరింగ్‌కు వెళ్లే ఆలోచనను మానుకోండి. దీనిపై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కనీసం ప్రాజెక్టును ఎలా ఉన్నది అలాగే ఉంచండి.’ అని లేఖలో పేర్కొన్నారు.

పోలవరంపై కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ


పోలవరం ప్రాజెక్టులో రీ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కేంద్ర లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>